Baapu OTT Release Date: థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే... బ్రహ్మాజీ 'బాపు' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు, ఎందులోనో తెలుసా?
Baapu OTT Platform: ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'బాపు' థియేటర్లలో విడుదలైన రెండు వారాలకు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫార్మ్ వివరాలు తెలుసుకోండి.

ప్రముఖ నటుడు బ్రహ్మాజీ (Brahmaji) కొంత విరామం తర్వాత కథానాయకుడిగా నటించిన సినిమా 'బాపు' (Baapu Movie). ఏ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ... అనేది ఉప శీర్షిక. అంటే ఇదొక తండ్రి ఆత్మహత్య కథ. థియేటర్లలో విడుదల అయ్యి వారం అవుతోంది అంతే! సర్‌ప్రైజ్ అండ్ షాకింగ్ న్యూస్ ఏమిటంటే... ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
జియో హాట్‌స్టార్‌లో బాపు స్ట్రీమింగ్... ఎప్పుడంటే?
Brahmaji's Baapu OTT Release Date and Platform: 'బాపు' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్‌స్టార్ ఓటీటీ వేదిక సొంతం చేసుకుంది. మార్చి 7న ఈ చిత్రాన్ని తమ ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ఇవాళ అనౌన్స్ చేసింది. థియేటర్లలో విడుదలైన 14 రోజులకు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందన్నమాట.
Also Read: స్టార్ హీరోకి 55 కేసులు... రూ 90 కోట్ల అప్పు... చేతిలో ఒక్క ఆఫర్ లేని టైంలో కాపాడింది ఎవరో తెలుసా?
View this post on Instagram
కథ నచ్చి రూపాయి తీసుకోకుండా చేసిన సినిమా!
'బాపు' సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. అయితే బాక్సాఫీస్ బరిలో ఆశించిన వసూళ్ల దక్కలేదు. దాంతో వెంటనే ఓటీటీలోకి తీసుకు వస్తున్నట్లు ఉన్నారు. కథ నచ్చడంతో రూపాయి కూడా తీసుకోకుండా తాను ఈ సినిమాలో నటించినట్లు బ్రహ్మాజీ తెలిపారు. ప్రస్తుత సమాజంలో ఇటువంటి సినిమాల అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. అయినా సరే థియేటర్లకు జనాలు మాత్రం రాలేదు.
'బాపు' సినిమాలో 'బలగం' సుధాకర్ రెడ్డి, సీనియర్ హీరోయిన్ ఆమని, ప్రముఖ నటుడు - దర్శక రచయిత అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. దయా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజు, సిహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించారు. రానా దగ్గుబాటితో పాటు రష్మిక మందన్న, 'కల్కి 2898 ఏడీ' దర్శకుడు నాగ్ అశ్విన్, యంగ్ హీరో విశ్వక్ సేన్ వంటి ప్రముఖులు సినిమా విడుదలకు ముందు ప్రచారంలో తమ వంతు సాయం చేశారు. అయినా ప్రేక్షకులను థియేటర్ల కు రప్పించడంలో చిత్ర బృందం విఫలం అయింది. మరి ఓటీటీలో ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

