Best OTT Movies: భూమి మీద అంతా నిద్రను కోల్పోతారు, ఆ ఒక్క అమ్మాయి తప్ప? నిద్రలేకపోతే అన్ని దారుణాలు జరుగుతాయా?
రోజుల తరబడి నిద్ర లేకపోతే అక్కడ ఘోర పరిణామాలు ఏర్పడుతాయి. పిచ్చి పట్టి ఒకర్నొకరు చంపుకుంటారు. నిద్ర పోగలిగే ఒకే ఒక చిన్నపిల్ల మటిల్డా ద్వారా సమస్య పరిష్కారమవుతుందా?
అవేక్ (Awake).. 2021లో అపోకలిప్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా. ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడి భూమ్మీద అందరూ నిద్రలేమితో బాధపడుతారు. జిల్ అనే మహిళ కూతురు మాత్రమే హాయిగా నిద్రపోగలుగుతుంది. దీంతో తన కూతురిని ల్యాబ్‌కు తీసుకెళ్తే.. నిద్రలేమికి పరిష్కారం లభిస్తుందని భావిస్తుంది. కానీ, ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటుంది. ఇంతకీ వారంతా నిద్రను ఎలా కోల్పోతారు? చివరికి పరిష్కారం లభిస్తుందా అనేది ఎంతో ఉత్కంఠభరితంగా తెరకెక్కించాడు దర్శకుడు.
కథేమిటంటే?
కథ విషయానికి వస్తే.. ఒకప్పుడు ఆర్మీ మెడిక్‌గా పనిచేసి, డ్రగ్ అడిక్షన్ నుంచి రికవర్ అవుతున్న ఒక మహిళ జిల్. ఆమె ఒక లోకల్ కాలేజ్ లో గార్డ్ గా పనిచేస్తుంది. ఆమె అక్కడి రీసెర్చ్ ల్యాబ్ నుంచి డ్రగ్స్ దొంగిలించి అమ్ముతుంటుంది. ఆమెకు నోవా, మటిల్డా అనే ఇద్దరు పిల్లలున్నారు. వాళ్లు ఒకరోజు కారులో వెళ్తున్నపుడు పవర్ ఆగిపోయి, ఇంకో కారుకు గుద్దుకొని ఒక లేక్ వైపుకు వెళ్తుంది. ఎలక్ట్రిసిటీతో నడిచేవేవీ పనిచేయట్లేదని ఒక పొలీస్ ఆఫీసర్ చెప్తాడు. హాస్పిటల్‌లో కోమా పేషెంట్ నిద్ర లేచినట్టు తెలుస్తుంది. ఇంట్లో ఎవరికీ నిద్ర రాదు. కాలనీలో అందరూ మేల్కొనే ఉంటారు. "సైకియాట్రిస్ట్ డా. మర్ఫీ ఇక ముందు ఎవరికీ నిద్ర రాదు. అందరూ నిద్రలేమితో బాధపడుతారు" అని చెప్తుంది. ది హబ్ అనే సైనిక స్థావరంలో ఉన్న ఒక పెద్దావిడ మాత్రమే నిద్రపోతోంది. ఆవిడ వల్ల మాత్రమే క్యూర్ కనిపెట్టొచ్చేమోనని వారిలో ఆశ కలుగుతుంది.
ఒకరోజు పొద్దున జిల్ కూతురు మటిల్డా నిద్రపోవటం జిల్ గమనిస్తుంది. ఆమె చనిపోయిందేమోనని జిల్ ముందు భయపడుతుంది. నిద్రపోయే శక్తి ఉన్నవ్యక్తిని బలిస్తే.. మళ్లీ అందరూ హాయిగా నిద్రపోవచ్చని స్థానికులు భావిస్తారు. దీంతో మటిల్డాను బలి ఇవ్వాలని చర్చ్ దగ్గర కొందరు సిద్ధమవుతారు. ఇంతలో ఒక పోలీస్ అధికారి కాల్పులు జరిపి.. మటిల్డాను రక్షిస్తాడు. జిల్ తన పిల్లల్ని తీసుకొని అక్కడ్నుంచి పారిపోతుంది. మటిల్డాను హబ్ కు తీసుకెళ్లాలని నోవా బలవంతపెట్టడంతో ఇష్టం లేకపోయినా జిల్ మటిల్డాను హబ్ కు తీసుకెళ్తుంది. వెళ్లే దారిలో మటిల్డా ఉన్న కారును ఒక ఖైదీ దొంగిలిస్తాడు. కొంతమంది వచ్చి వారిని రక్షించటంతో వాళ్లు హబ్ కి వస్తారు. జిల్ ఒంటరిగా హబ్ లోపలికి వెళ్తుంది. అక్కడ అనారోగ్యంతో నిద్రపోతున్న ఒక మహిళను చూస్తుంది. నిద్రలేమికి క్యూర్ లేదు. కానీ బ్రెయిన్ ఫంక్షన్ అవటానికి కొన్ని రకాల డ్రగ్స్ ఇస్తున్నామని, కానీ ఇది టెంపరరీ సొల్యూషనే. దీనివల్ల న్యూరల్ డ్యామేజ్ జరుగుతుందని డాక్టర్ మర్ఫీ చెప్తుంది.
మటిల్డా నిద్రపోతుందని తెలియగానే, ఆమె ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలనుకుంటారు. అనస్థీసియా ఇవ్వబడిన ఒక కోతి కూడా ల్యాబ్ లో నిద్రపోకుండా కనపడుతుంది. మనుషులతో పాటూ కోతులు కూడా నిద్రపోవట్లేదని డాక్టర్ చెప్తుంది. మటిల్డాతో పాటు ఈ సమస్య లేకుండా నిద్రపోతున్న పెద్దావిడ గుండెపోటుతో చనిపోతుంది. రోజుల పాటు నిద్రలేకపోవటం వల్ల అక్కడివారంతా పిచ్చి పట్టి ఒకర్నొకరు చంపుకుంటారు.
నోవాకు హాల్యుసినేషన్స్ మొదలయ్యి కరెంట్ షాక్ తగిలించుకొని చచ్చిపోతాడు. ఆ తర్వాత రోజు నోవా లేచి.. కలలో ఉన్నానని చెప్తాడు. జిల్ చావుబతుకుల్లో ఉంటుంది. నోవా వల్ల మటిల్డా ఒక విషయం రియలైజ్ అవుతుంది. ఆమె నిద్రపోవటానికి కారణం.. టెంపరరీగా చనిపోవటమే అని. జిల్‌ను తీసుకెళ్లి నీటిలో ముంచుతారు. ఆమె నిద్రలేవటంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read: బిడ్డను బిర్యానీ చేసి ఊళ్లోవాళ్లకు విందుగా పెడితే? ఈ మూవీ పెద్దలకు మాత్రమే.. పిల్లలతో అస్సలు చూడలేరు
Awake Movie Trailer: