Ashoka Vanam Lo Arjuna Kalyanam OTT Rights: ఆహాలో 'అశోక వనంలో అర్జున కళ్యాణం', ఎప్పుడు వస్తుందో?
విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో తెలుసా? 'ఆహా'లో! మరి, ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక్కసారి వివరాలు చూడండి.
'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమాతో యువ కథానాయకుడు విశ్వక్ సేన్ ఈ రోజు థియేటర్లలోకి వచ్చారు. రుక్సార్ థిల్లాన్, రితికా నాయక్ కథానాయికలుగా నటించారు. 'రాజావారు రాణిగారు' దర్శకుడు రవి కిరణ్ కోలా కథ, కథనం, మాటలు అందించడంతో పాటు షో రన్నర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాకు వస్తున్న స్పందన పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. అన్నట్టు... ఈ సినిమా ఏ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుందో తెలుసా?
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ 'ఆహా'లో 'అశోక వనంలో అర్జున కళ్యాణం' స్ట్రీమింగ్ కానుంది. అవును... ఈ రోజు థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు టైటిల్ కార్డ్స్‌లో అఫీషియల్ డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ 'ఆహా' అని వేశారు.
ఇటీవల థియేటర్లలో విడుదలైన 28 రోజులకు కొన్ని సినిమాలు ఓటీటీ వేదికల్లోకి వచ్చాయి. ప్లాప్ టాక్ వచ్చిన సినిమాలు అయితే అంతకంటే ముందు వచ్చాయి. 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కనుక... ఎలా లేదన్నా వచ్చే నెలలో 'ఆహా'లో స్ట్రీమింగ్ కావచ్చు. జూన్ తొలి వారం లేదా రెండో వారంలో విశ్వక్ సేన్ సినిమాను డిజిటల్ వీక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ.
Also Read: డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ రివ్యూ: మార్వెల్ మంత్రం పని చేసిందా?
View this post on Instagram
View this post on Instagram