Ardhamayyindha Arun Kumar : జీవితంలో ఎప్పుడైనా కండోమ్ చూశావా? నుంచి బాస్ లేడీతో రొమాన్స్ వరకు...
Ardhamainda Arun Kumar Web Series streaming date : ఆహా కొత్త వెబ్ సిరీస్ 'అర్థమైందా అరుణ్ కుమార్' ఈ నెలాఖరు నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.
హర్షిత్ రెడ్డి (Harshith Reddy), '30 వెడ్స్ 21' ఫేమ్ అనన్యా శర్మ జంటగా నటించిన వెబ్ సిరీస్ 'అర్థమైందా అరుణ్ కుమార్' (Ardhamainda Arun Kumar Web Series). ఇందులో తేజస్వి మాదివాడ (Tejaswi Madivada) ప్రధాన పాత్ర పోషించారు. ఆహా ఒరిజినల్ సిరీస్ ఇది. జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు. ప్రియదర్శి చేతుల మీదుగా ఈ రోజు ట్రైలర్ విడుదల అయ్యింది.
ట్రైలర్ ఎలా ఉందేంటి?
కార్పొరేట్ ప్రపంచంలో కొత్తగా వచ్చిన ఓ ఇంటర్న్ ఎన్ని కష్టాలు పడ్డాడు? అతని జీవితం ఏమిటి? అనేది చూపించారు. ఆఫీసులో అమ్మాయితో ప్రేమ, బాస్ లేడీతో రొమాన్స్, ఇంట్లో కష్టాలు... కంప్లీట్ లైఫ్ చూపించారు.
'ఏదో ఒకలా బతికేసేవాడు మనిషి. కోరుకున్నది సాధించడానికి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టాన్ని నమ్ముకునేవాడు మహర్షి అని! బొంగు ఏమీ కాదు' అని హీరో హర్షిత్ రెడ్డి చెప్పే మాటతో ట్రైలర్ మొదలైంది. ఆఫీసులో అయితే ఇంటర్న్ కింద జాయిన్ అవుతాడు కానీ ఎవరూ అతడికి వర్క్ ఇవ్వరు. దాంతో అందరి వెంట వర్క్ ఇవ్వమని, తన ఐడియాలు వినమని చెబుతాడు. ఒకానొక సందర్భంలో ఒక కొలీగ్ 'జీవితంలో ఎప్పుడైనా కండోమ్ చూశావా?' అని కూడా అడుగుతుంది.
'కార్పొరేట్ జీవితంలో పని చేయడం కన్నా చేస్తున్నట్లు కనిపించడం ఇంపార్టెంట్' డైలాగ్ ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్షిత్, అనన్య మధ్య ప్రేమ కథకు ట్రైలర్ లో మంచి స్పేస్ దక్కింది. తేజస్వి బోల్డ్ రోల్ చేశారు. 'పద్ధతిగా ఉంటే ఇక్కడ అస్సలు పనికి రాదు' అని ఆమె చెప్పే డైలాగ్, హర్షిత్ రెడ్డితో లిప్ లాక్ అండ్ రొమాన్స్... చూస్తే 'అర్థమైందా అరుణ్ కుమార్'లో రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నట్లు అర్థం అవుతోంది. అంతే కాదు... ప్రాజెక్ట్ లీడ్ అయిన అమ్మాయి కింద ఉద్యోగికి ఐఫోన్ గిఫ్ట్ ఇస్తుంది. తేజస్వితో రొమాన్స్ కారణంగా హర్షిత్ రెడ్డి జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయి. ఆఫీసులో అమ్మాయితో ప్రేమ కథ ఏమైంది? తల్లిదండ్రులు ఆస్పత్రిలో ఎందుకు చేరారు? అనేది తెలియాలంటే సిరీస్ చూడాలి.
ట్రైలర్ చివరలో ప్రముఖ నటుడు అభినవ్ గోమఠం కనిపించారు. 'నీలాంటి పిచ్చోడిని ఫస్ట్ టైమ్ చూస్తున్నాను' అని ఆయన చెప్పడం... 'పిచ్చోడిని కాదండి! అరుణ్ కుమార్ ముందా' అని హర్షిత్ రెడ్డి సమాధానం చెప్పడంతో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
Also Read : రామ్ చరణ్ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే
ఆహాలో విడుదల అయ్యేది ఎప్పుడంటే?
Ardhamayyindha Arun Kumar Release Date : జూన్ 30వ తేదీ నుంచి ఆహాలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఆరె స్టూడియోస్, లాఫింగ్ కౌ ప్రొడక్షన్స్ సంస్థలు 'అర్థమైందా అరుణ్ కుమార్' వెబ్ సిరీస్ రూపొందించాయి. ట్రైలర్ విడుదల చేసిన ప్రియదర్శి ఈ సిరీస్ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
''కార్పొరేట్ ఉద్యోగుల జీవితాలు, వారి ప్రయాణంలో ఎదురయ్యే సాధక బాధకాలు, కలలను సాకారం చేసుకునే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు, సాధించే విజయాలు వంటి వాటిని ఈ సిరీస్‌లో మనం చూడొచ్చు'' అని 'ఆహా' వర్గాలు తెలిపారు.
Also Read : పాపం వరుణ్ సందేశ్ - చివరకు డ్యాన్స్ టీమ్‌ను పరిచయం చేసే స్థాయికి....