By: ABP Desam | Updated at : 04 Mar 2023 11:36 AM (IST)
'అమిగోస్'లో కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'అమిగోస్' (Amigos Movie 2023). ఇందులో ఆయన ట్రిపుల్ రోల్ చేశారు. ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదల అయ్యిందీ సినిమా. వచ్చే నెలలో ఓటీటీలో రానుంది. మార్చి 10న ఓటీటీలో 'అమిగోస్' విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. కానీ, ఆ రోజున ఓటీటీలో విడుదల కావడం లేదు. మరి, ఎప్పుడు అవుతుంది? అంటే...
ఏప్రిల్ 1న 'అమిగోస్'
'అమిగోస్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 1 నుంచి వీక్షకులకు సినిమా అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. తెలుగులో మాత్రమే సినిమా విడుదల చేస్తారా? ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తారా? అనేది చూడాలి. 'అమిగోస్' కంటే ముందు విడుదలైన కళ్యాణ్ రామ్ సినిమా 'బింబిసార'ను ఇతర భాషల్లో అనువదించి విడుదల చేశారు.
నందమూరి కళ్యాణ్ రామ్ 'అమిగోస్'లో డొపెల్ గ్యాంగర్ రోల్స్ మూడు చేశారు. ఒకే రూపురేఖలతో ఉన్న ముగ్గురు వ్యక్తులుగా కనిపించారు. మనిషిని పోలిన మనుషులు ప్రపచరంలో ఏడుగురు ఉన్నారని చెబుతారు కదా! అందులో ముగ్గురు కలిస్తే? ఆ ముగ్గురిలో ఒకడు నరరూప రాక్షసుడు అయితే? ఎలా ఉంటుంది? అనేది కథ.
నందమూరి కళ్యాణ్ రామ్ సరసన కన్నడ భామ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటించారు. తెలుగులో ఆమెకు తొలి చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ సినిమాను నిర్మించారు. దీంతో రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యారు. 'అమిగోస్'కు అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. సూపర్ హిట్ టాక్ రాలేదు. మూడు పాత్రల్లో కళ్యాణ్ రామ్ వేరియేషన్స్ చూపించినా... నటుడిగా ఆయన కష్టపడినప్పటికీ... దర్శకత్వ లోపం వల్ల కాన్సెప్ట్ సరిగా ఎగ్జిక్యూట్ కాలేదనే కామెంట్స్ వచ్చాయి.
Also Read : ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ను అవమానించిన బాలకృష్ణ?
'అమిగోస్' వసూళ్ళు పక్కన పెడితే... చిత్ర నిర్మాతలు, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి సంతోషం వ్యక్తం చేశారు. 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' తర్వాత తమ సంస్థకు మరో విజయం వచ్చిందని, తమకు ఇది హ్యాట్రిక్ అని చెబుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మౌత్ టాక్ బావుందని, ప్రతి షోకి కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయని చెప్పారు. అయితే, ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన వసూళ్లు రాలేదు. 'బింబిసార' సినిమాతో కంపేర్ చేస్తే... 'అమిగోస్'కు తక్కువ వచ్చాయని చెప్పాలి. ఆ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే ఆరున్నర కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటించిన 'ఇజం' సినిమాకు మూడు కోట్ల రూపాయల కంటే ఎక్కువ వచ్చింది. ఆఖరికి 'ఎమ్మెల్యే'కు రూ. 2.72 కోట్లు, 'ఎంత మంచివాడవురా'కు రూ. 2.20 కోట్లు వచ్చాయి. ఆ సినిమాలతో కంపేర్ చేసినా... 'అమిగోస్'కు ఫస్ట్ డే ఓపెనింగ్ తక్కువే.
Movie Releases This Week: ఉగాది కానుకగా థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే!
Priya Banerjee: ‘కిస్’ టు ‘అసుర’ - ‘రానా నాయుడు’ బ్యూటీ ప్రియా బెనర్జీ గురించి ఈ విషయాలు తెలుసా?
ఓటీటీలోకి నేరుగా రవిబాబు ‘అసలు’ సినిమా, మళ్లీ ఆమెతోనేనా?
వెబ్ సీరిస్‌ల్లో అశ్లీల సీన్లు - విజయ్ శాంతి ఆగ్రహం ‘రానా నాయుడు’ పైనేనా?
Aditi Rao Hydari : సిద్ధూతో ప్రేమ - అసలు అదితి చిక్కదు దొరకదు
AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి
వడగళ్ల వానతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్
CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్
Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్