Akhanda on OTT: ఓటీటీలో 'అఖండ' రికార్డ్.. 24 గంటలు గడవకముందే..
ఓటీటీలోకి వచ్చి 24 గంటలు గడవకముందే 'అఖండ' సినిమా మిలియన్ స్ట్రీమింగ్స్ సాధించి అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన 'అఖండ' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో తెలిసిందే. కోవిడ్ సెకండ్ వేవ్ తరువాత థియేటర్లలో విడుదలైన ఈ సినిమా వందకి పైగా థియేటర్లలో యాభై రోజులు పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన ఈ సినిమా జనవరి 21న ఓటీటీలో(హాట్ స్టార్) విడుదలైంది. ఓటీటీలోకి వచ్చి 24 గంటలు గడవకముందే ఈ సినిమా మిలియన్ స్ట్రీమింగ్స్ సాధించి అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం పోషించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అఘోరా గెటప్ కి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. అఘోరా గెటప్ లో బాలయ్య కనిపించే ప్రతిసారి తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశారు. ఈ సినిమాలో ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్ గా కనిపించగా.. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలకపాత్రలు పోషించారు.
ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన తదుపరి సినిమా మొదలుపెట్టనున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని సమాచారం. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ లాంటి స్టార్లు కనిపించనున్నారు.
View this post on Instagram
Also Read: చై-సామ్ విడాకులు.. ఆ చెత్త వార్తలు బాధపెట్టాయంటున్న నాగ్..
Also Read: నానిని పెళ్లి చేసుకోమని అడిగిన వేశ్య.. వీడియో చూశారా..?