Akhanda 2 OTT: ఈ వారమే 'అఖండ 2' ఓటీటీ రిలీజ్... ఐదు భాషల్లో స్ట్రీమింగ్ - ఎందులో, ఎప్పట్నుంచి చూడొచ్చంటే?
Akhanda 2 OTT Release Date: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ హిట్ 'అఖండ 2 తాండవం' డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ. ఎప్పటి నుంచి డిజిటల్ తెరపై చూడొచ్చంటే?

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'అఖండ 2 తాండవం' (Akhanda 2 Thaandavam). నందమూరి అభిమానులతో పాటు సనాతన ధర్మాన్ని అనుసరించే భక్తులను ఆకట్టుకున్న చిత్రమిది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టిన చిత్రమిది. ఈ వారం ఓటీటీలోకి రానుంది.
ఓటీటీలోకి 'అఖండ 2' వచ్చేది ఎప్పుడు?
ఈ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది?
Akhanda 2 OTT Release Date Netflix India Time: 'అఖండ 2 తాండవం' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఇంటర్నేషనల్ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఓటీటీలోకి సినిమాను ఎప్పుడు స్ట్రీమింగ్ చేసేదీ వెల్లడించింది.
జనవరి 9వ తేదీ నుంచి 'అఖండ 2' స్ట్రీమింగ్ మొదలు అవుతుందని, వీక్షకులకు సినిమా అందుబాటులోకి వస్తుందని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ స్పష్టం చేసింది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ... ఐదు భాషల్లో డిజిటల్ తెరపైకి తీసుకు రానున్నారు. పాన్ ఇండియా స్థాయిలో స్ట్రీమింగ్ చేయనున్నారు.
Also Read: NBK 111: బాలకృష్ణ సినిమా కథ మారింది కానీ హీరోయిన్ కాదు!
View this post on Instagram
అసలు 'అఖండ 2' కథ ఏమిటి?
ఈ సినిమాలో ఎవరెవరు నటించారు?
'అఖండ 2 తాండవం' కథ విషయానికి వస్తే... భారత్ - చైనా సరిహద్దుల్లో ఒకటైన గాల్వాన్ లోయలో సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో చైనా ఆర్మీ జనరల్ కొడుకు మరణిస్తాడు. అందుకు ప్రతీకారంగా భారత్ మీద బయో వార్ చేస్తాడు ఆ జనరల్. మహా కుంభమేళాలో ఓ వైరస్ విడుదల చేస్తారు. ఈ విపత్తు నుంచి ప్రజల్ని కాపాడటంతో అఖండ (బాలకృష్ణ) కవల సోదరుడు మురళీకృష్ణ (బాలకృష్ణ) కుమార్తె జనని (హర్షాలీ మల్హోత్రా) కీలకం అవుతుంది. ఆమెను చంపడానికి కొందరు రంగంలోకి దిగుతారు. వాళ్ళ నుంచి జననితో పాటు భారత దేశాన్ని అఖండ ఎలా కాపాడాడు? అనేది కథ.
'అఖండ'లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేయగా... హర్షాలీ మల్హోత్రా, సంయుక్త, కబీర్ సింగ్ దుహాన్, పూర్ణ తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. సింహ, లెజెండ్, అఖండ తర్వాత బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన నాలుగో చిత్రమిది. బాలకృష్ణ చిన్న కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ పతాకం మీద రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.





















