అన్వేషించండి

Anjali: అంజలి రోల్ ఒక్కటే... వేశ్య పాత్రలో ఆమె వేరియేషన్‌కు హ్యాట్సాఫ్!

Anjali Role In Bahishkarana: 'బహిష్కరణ' వెబ్ సిరీస్‌లో అంజలి వేశ్య పాత్ర చేశారు. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లోనూ ఇంచు మించు అటువంటి క్యారెక్టరే. కానీ, ఆమె నటనలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది.

రెండు నెలల వ్యవధిలో నటీనటులు ఎవరి నుంచి అయినా రెండు ప్రాజెక్టులు వస్తే ఆ రెండిటిలో ఎలా నటించారు? అనేది కంపేరిజన్ వస్తుంది. ఒకవేళ ఆ రెండిటిలో సేమ్ రోల్స్ అయితే? కంపేరిజన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. 'ఆదికేశవ', 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలు విడుదలైన సమయంలో శ్రీ లీల రోల్స్, ఆమె యాక్టింగ్ మీద విమర్శలు వచ్చాయి. రెగ్యులర్ హీరోయిన్ రోల్ విషయంలో ఆడియన్స్ నుంచి అటువంటి రియాక్షన్ ఉంటే... వేశ్య (prostitute) పాత్ర విషయంలో ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. కానీ, అంజలి అటువంటి కంపేరిజన్స్ రాకుండా చూసుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యింది.

'బహిష్కరణ'లో కొత్తగా అంజలి... వేరియేషన్ చూశారా?
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'... మే 31న థియేటర్లలో విడుదలైన విశ్వక్ సేన్ సినిమా గుర్తు ఉందా? అందులో అంజలి నటించారు. ఆమెది వేశ్య పాత్ర. కథలో కీలక దశలో హీరోకి సాయం చేసే మహిళగా కనిపిస్తారు. గోపరాజు రమణ మెడ మీద కత్తి పెట్టిన సన్నివేశంలో వీరత్వం చూపించారు. కట్ చేస్తే... జీ 5లో ఈ నెల 19న ఒరిజినల్ సిరీస్ 'బహిష్కరణ' రానుంది. అందులో అంజలి ప్రధాన పాత్రధారి.

'బహిష్కరణ'లోనూ అంజలిది వేశ్య పాత్ర. ఆల్రెడీ ట్రైలర్ విడుదలైంది. ఒక్కసారి అది చూడండి. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనేది ఎక్కడా గుర్తు రాదు. సేమ్ రోల్ అయినా సరే ఇంతకు ముందు పాత్ర గానీ, ఆ ఛాయలు గానీ గుర్తుకు రాకుండా నటించడంలో అంజలి సక్సెస్ అయ్యారు. వేరియేషన్ చూపించారు. కథలు, కథా నేపథ్యాలు వేరు కావడం కూడా ఆమెకు కలిసి వచ్చింది.

నటనలో, డైలాగ్ డెలివరీలో కొత్త అంజలి!
'బహిష్కరణ' ట్రైలర్ గమనిస్తే... అంజలి నటన, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉన్నాయ్. సాధారణంగా అంజలి మాటల్లో గోదావరి యాస కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కానీ, 'బహిష్కరణ'లోనూ ఆ యాస ఉంది. కానీ, సెటిల్డ్ వేలో ఉంది. 'నన్ను గుడికి తీసుకు వెళ్తావా?' అని అడిగేటప్పుడు కానీ, చేతికి గొట్టాలు పెట్టుకుని తినేటప్పుడు గానీ ఆ పాత్రకు అవసరమైన సున్నితత్వం చూపించారు. వీరోచిత సన్నివేశాల్లో అయితే కోపం చూపించినప్పుడు నటనలో ఆమె అనుభవం కనిపించింది.

Also Read: 'ఇండియన్ 2' ఫస్ట్ రివ్యూ... ఆడియన్స్‌లో బజ్ తక్కువే కానీ సూపర్ హిట్ రిపోర్ట్!

Bahishkarana Web Series Release Date: పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన 'బహిష్కరణ' వెబ్ సిరీస్ జూలై 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్ సిరీస్ మీద ఆసక్తి పెంచితే... అందులో అంజలి క్యారెక్టర్ మరింత ఆసక్తి పెంచింది. వేశ్య పాత్ర అంటే ప్రేక్షకుల్లో కొందరి దృష్టిలోనూ చిన్న చూపు ఉంటుంది. రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు ఆ పాత్రను మాత్రమే చూసేలా, ఆ తర్వాత ఫెరోషియస్, సీరియస్ సీన్లు వచ్చినప్పుడు పాత్రతో ప్రయాణం చేసేలా అంజలి నటించారు. సినిమాలతో పాటు ఓటీటీల్లోనూ అంజలి విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఆవిడ ఫుల్ బిజీ.

Also Read'సారంగ దరియా' ఫస్ట్ రివ్యూ - ట్రాన్స్‌జెండర్స్ మీద సెన్సిటివ్ టాపిక్ టచ్ చేస్తూ...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
Embed widget