News
News
X

Keeravani: ఆస్కార్ వేదికపై కీరవాణి ‘నాటు నాటు’ పాట లైవ్ షో!

95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఎంఎం కీరవాణీ లైవ్ ప్రదర్శన చేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఏ ఆర్ రెహమాన్ కూడా ఇలాగే ప్రదర్శన ఇచ్చారు. ఈ నేపథ్యంలో దీనిపై ఉత్కంఠ నెలకొంది.

FOLLOW US: 
Share:

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా గతేడాది మార్చి లో విడుదల అయి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలుసిందే. దీంతో ఈ సినిమాకు ప్రశంసలతో పాటు అవార్డుల పంట కూడా పండింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ సహా మరెన్నో ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుంది. దీంతో ఈ మూవీ ఆస్కార్ కు నామినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ మూవీలో ‘నాటు నాటు’ పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ కు ఎంపికైంది. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలందించారు. గేయ రచయిత చంద్రబోస్ లిరిక్స్ అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కీరవాణి, కాల భైరవ ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ వేదికపై ఈ పాటను ప్రదర్శించడానికి కీరవాణి తో పాటు రచయిత చంద్రబోస్ కు కూడా ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. 

ఇక ఈ ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమంలో కీరవాణి ఆస్కార్ వేదిక పై లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఇలా ఆస్కార్ వేదికలపై లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా ఏ ఆర్ రెహమాన్ ‘జై హో’ పాటను ఇలాగే లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. అయితే ఈసారి కీరవాణి ఆస్కార్ వేదికపై లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనున్నారనే వార్తలు రావడంతో ఆసక్తి నెలకొంది. కొంతమంది మాత్రం పాట పాడిన సింగర్, డాన్స్ కంపోజర్ లకు కూడా ఇందులో భాగం ఉంది కదా వాళ్లనెందుకు ఆహ్వానించలేదు? ఎప్పుడూ కీరవాణి కుటుంబమే స్టేజి మీద కనబడుతుంది అంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. గతంలో గోల్డెన్ గ్లోబ్ పురస్కార సమయంలో కూడా ఈ కామెంట్లు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఆస్కార్ ఆహ్వాన సమయంలో ఆ వ్యాఖ్యలు తెరపైకి వస్తున్నాయి. మరి ఇందులో మున్ముందు ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి. ఇక ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. వీరంతా ఓ వారం రోజుల ముందుగానే ఈ కార్యక్రమానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

ఈ మూవీలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కలసి చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేసాయనే చెప్పాలి. చరణ్, తారక్ నటనకు వందశాతం మార్కులు పడ్డాయి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌ చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్ నటించగా.. తారక్ సరసన ఒలివియా మోరిస్ నటించింది. అలాగే మూవీలో అజయ్ దేవగణ్, శ్రియ ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. గతేడాది మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమా యావత్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది.

Read Also: ఆరంభం అదిరింది - బ్లాక్ బస్టర్లతో మొదలైన 2023, బాలీవుడ్‌కూ మంచి రోజులు!

Published at : 07 Feb 2023 04:42 PM (IST) Tags: keeravani Ram Charan NTR S S Rajamouli Oscar Awards 2023 S. S. Rajamouli

సంబంధిత కథనాలు

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు,  ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !