News
News
X

Organic Mama Hybrid Alludu: ఎస్వీ కృష్ణారెడ్డి ఈజ్ బ్యాక్, ఆకట్టుకుంటోన్న ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ ట్రైలర్

బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’. ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలై ఆకట్టుకుంటోంది.

FOLLOW US: 
Share:

ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా నటించారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. తాజాగా మూవీకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ టీమ్. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓ వైపు సినిమా షూటింగ్ పనులు జరుగుతుండగానే మరో వైపు సినిమా ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తూ వచ్చారు మేకర్స్. హీరో సోహెల్ కు ప్రస్తుతం మంచి క్రేజ్ ఉండటం, మరోవైపు సినిమాలో సీనియర్ నటీనటులు చేస్తుండటంతో ఈ మూవీ పై ఆసక్తి పెరిగింది. 

ఈ మూవీ కు సంబంధించిన అప్డేట్స్ ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటి వరకూ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందనే వస్తోంది. సినిమా టైటిల్ కూడా కాస్త భిన్నంగా ఉండటంతో హైప్ పెరిగింది. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ లో హీరో సోహెల్ లుక్ కొత్తగా కనిపించింది. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిలా కనిపిస్తున్నాడు సోహెల్. ఇక సినిమాలో చాలా మంది సీనియర్ నటీనటులు కనిపించారు. రాజేంద్ర ప్రసాద్, మీనా సహా సునీల్, పృథ్వీ, సప్తగిరి లాంటి కమెడియన్స్ తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు నటించడం విశేషం. లవ్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. 

ఈ మూవీలో హీరో వరుణ్ సందేశ్, రష్మీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వరుణ్ సందేశ్ సీరియస్ పాత్ర లో ఫైట్ చేస్తూ కనిపించారు. అయితే ఎవరి రోల్ ఏంటనేది తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ చెప్పే ‘‘రూపాయలతో లెక్కపెట్టేది ఆస్తి, లెక్కపెట్టలేనిది సంస్కారం’’ వంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఇక హీరో సోహెల్ కు ఇది హీరోగా రెండో సినిమా ఆయన ఇటీవలే ‘లక్కీ లక్ష్మణ్’ సినిమాలో నటించారు. తర్వాత వెంటనే ఈ మూవీ విడుదలకు సిద్దమయ్యారు. అలాగే తన సినిమాల ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంతో మంది నటీనటులను పరిచయం చేసిన సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ఈ మూవీకు దర్శకత్వం వహించడంతో మూవీ పై ఆసక్తి పెరిగింది. మరో విశేషం ఏమిటంటే ఆయనే ఈ సినిమాకు స్వయంగా మాటలు రాసుకున్నారు. ఈ సినిమాలో సునీల్‌, కృష్ణభగవాన్‌, సన, ప్రవీణ్‌, సప్తగిరి, అజయ్‌ఘోష్‌, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర తదితర సీనియర్ ఆర్టిస్ట్లు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా మార్చి 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మూవీ తో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, హీరో సోహెల్ కు ఎలాంటి హిట్ అందుతుందో చూడాలి. 

Published at : 28 Feb 2023 08:58 PM (IST) Tags: Sohel Rajendra Prasad mirnalini ravi Organic Mama Hybrid Alludu

సంబంధిత కథనాలు

BRS - Keerthi Suresh: నేనేమీ గుజరాత్ నుంచి రాలేదు కదా - కీర్తి సురేష్ కామెంట్స్‌ను వాడేసుకుంటున్న బీఆర్ఎస్

BRS - Keerthi Suresh: నేనేమీ గుజరాత్ నుంచి రాలేదు కదా - కీర్తి సురేష్ కామెంట్స్‌ను వాడేసుకుంటున్న బీఆర్ఎస్

Bommarillu Bhaskar: అప్పుడు విమర్శలు, ఇప్పుడు విజిల్స్ - థియేటర్లో ‘ఆరెంజ్’ మూవీ చూసి బొమ్మరిల్లు భాస్కర్ భావోద్వేగం

Bommarillu Bhaskar: అప్పుడు విమర్శలు, ఇప్పుడు విజిల్స్ - థియేటర్లో ‘ఆరెంజ్’ మూవీ చూసి బొమ్మరిల్లు భాస్కర్ భావోద్వేగం

G20 Summit 2023: సిగ్గు, శరంలేని జాతి - విశాఖ జీ20 సదస్సులో తమిళ బ్యానర్లపై నటి సంచలన వ్యాఖ్యలు

G20 Summit 2023: సిగ్గు, శరంలేని జాతి - విశాఖ జీ20 సదస్సులో తమిళ బ్యానర్లపై నటి సంచలన వ్యాఖ్యలు

Ram Charan: అభిషేక్ బచ్చన్ చేయని సాహసాన్ని చరణ్ చేసి చూపించాడు, కానీ...

Ram Charan: అభిషేక్ బచ్చన్ చేయని సాహసాన్ని చరణ్ చేసి చూపించాడు, కానీ...

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

టాప్ స్టోరీస్

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nitish Rana: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన కోల్‌కతా - అస్సలు అనుభవం లేని ప్లేయర్‌కి!

Nitish Rana: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన కోల్‌కతా - అస్సలు అనుభవం లేని ప్లేయర్‌కి!

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత