అన్వేషించండి

NTR30 First Look: ‘సముద్రం నిండా అతని కథలే - రక్తంతో రాసినవి’ - ఎన్టీఆర్30 టైటిల్, ఫస్ట్‌లుక్ వచ్చేస్తున్నాయి!

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఎన్టీఆర్30’ టైటిల్, ఫస్ట్‌లుక్ మే 19వ తేదీన విడుదల కానున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మోస్ట్ అవైటెడ్ ‘ఎన్టీఆర్30’ టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. మే 19వ తేదీన ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను సోషల్ మీడియా ద్వారా అందించారు. ‘సముద్రం అతని కథలతో నిండిపోయింది. అవి రక్తంతో రాసినవి.’ అనే క్యాప్షన్ ఉన్న పోస్టర్‌ను ఈ సందర్భంగా నిర్మాతలు విడుదల చేశారు. సముద్రం ఒడ్డున రక్తంతో తడిసిన కత్తులను కూడా ఈ పోస్టర్‌లో చూడవచ్చు.

ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్ డేట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు కొరటాల శివ ఓ పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పలు పేర్ల పరిశీలించిన తర్వాత ఈ చిత్రానికి ‘దేవ‌ర’ అనే టైటిల్ ఓకే చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హీరో ఎన్టీఆర్ సహా, చిత్ర నిర్మాతలు సైతం ఈ టైటిల్ బాగుందని చెప్పినట్లు సమాచారం. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సినిమా టైటిల్ తో పాటు, ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్రబృందం ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ‘NTR30’ చిత్రానికి ‘దేవర’ అనే టైటిల్ ఫైనల్ అయ్యిందా? లేదా? అనేది ఆ రోజునే తెలియనుంది.  

ఈ చిత్రం ఎన్టీఆర్ కొత్త లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కు ప్రముఖ హేర్ స్టైలిష్ట్  అలీమ్ హ‌కీమ్ ప్రత్యేకంగా హెయిర్ స్టైల్ రూపొందిస్తున్నారట. రీసెంట్ గా హకీమ్  షేర్ చేసిన ఫొటోలో ఎన్టీఆర్ డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించాడు. కొర‌టాల శివ సినిమా కోస‌మే ఈ లుక్ అని ప్ర‌చారం జరిగింది.

‘NTR30’ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూళ్లను కంప్లీట్ చేసుకుంది. ఇవాళ్టి(సోమవారం) నుంచి రామోజీ ఫిల్మ్‌ సిటీలో మరో కొత్త షెడ్యూల్‌ మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో భాగంగా ఎన్టీఆర్‌పై భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ ను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది (2024) ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది.

రక్తం రుచి మరిగిన మృగాళ్లను వేటాడే మగాడి పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తారని చెప్పి దర్శకుడు కొరటాల శివ సినిమాపై అంచనాలు మరింత పెంచేశారు. ఎన్టీఆర్ 30 చిత్రీకరణ ఇలా మొదలైందో? లేదో? అలా లీకుల బెడద మొదలైంది. ఆల్రెడీ సెట్స్ నుంచి ఎన్టీఆర్ ఫోటోలు, బ్లడ్ ట్యాంక్స్ ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇతర సాంకేతిక నిపుణుల్లో హాలీవుడ్ నుంచి కొంత మందిని తీసుకున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Embed widget