News
News
X

NTR30: ఎన్టీఆర్30 ప్రీప్రొడక్షన్ షురూ, డిసెంబర్‌లో షూటింగ్ - పిక్ వైరల్!

ఎన్టీఆర్30 సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

FOLLOW US: 
 
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) 'ఆర్ఆర్ఆర్'(RRR) తరువాత ఇప్పటివరకు మరో సినిమాను మొదలుపెట్టలేదు. కొరటాల శివ(Koratala Siva), ప్రశాంత్ నీల్(Prashanth neel) దర్శకత్వంలో ఆయన సినిమాలు చేయనున్నారు. ముందుగా కొరటాల శివ సినిమాను మొదలుపెట్టాల్సివుంది. కానీ ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ తన లుక్ ని మార్చుకున్నారు. నెలలు గడుస్తున్నా మూవీ ఇంకా పట్టాలెక్కకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొరటాల-ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందని వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ షురూ చేసినట్లు నిర్మాణ సంస్థ ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో దర్శకుడు కొరటాల శివ.. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ తో కలిసి చర్చిస్తున్నట్లుగా ఉంది. ఈ నెలలోనే ఫార్మల్ గా సినిమాను లాంచ్ చేసి.. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తానికి ఎన్టీఆర్30 టీమ్ నుంచి మెల్లగా అప్డేట్స్ రావడం మొదలయ్యాయి. 

దర్శకుడు కొరటాల శివ 'ఆచార్య'తో డిజాస్టర్ అందుకున్నారు. అందుకే ఎన్టీఆర్ సినిమా విషయంలో ఎలాంటి తప్పులు జరగకూడదని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ కారణంగానే సినిమా ఆలస్యమవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. బాలీవుడ్ అమ్మాయిని తీసుకుంటే పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్ కి పనికొస్తుందని ఆలోచిస్తున్నారు. స్టార్ హీరోయిన్లతో పాటు మృణాల్ ఠాకూర్ లాంటి వాళ్లను కూడా పరిశీలిస్తున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఛాన్స్ ఎవరికీ దక్కుతుందో చూడాలి..! 

Also Read : పక్కా ప్లానింగ్‌తో పవన్ అడుగులు - రాజకీయాలు, సినిమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా!
 
విజయశాంతి ఓకే చెబుతుందా..? 
ఈ సినిమాలో పవర్ ఫుల్ మహిళ క్యారెక్టర్ ఒకటి ఉందట. దానికోసం ఒకప్పటి హీరోయిన్, టాలీవుడ్ తొలి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి(Vijayashanthi)ని సంప్రదించినట్లు సమాచారం. ఆమెని కలిసి కొరటాల కథ వినిపించారట. అయితే దీనికి ఆమె ఒప్పుకుందా..? లేదా..? అనే విషయంలో క్లారిటీ రాలేదు.
 
చాలా ఏళ్లుగా విజయశాంతి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీఎంట్రీ ఇచ్చి భారీ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో తన పాత్ర నచ్చడం వలనే సినిమా చేశానని.. ఇకపై అలాంటి రోల్ వస్తుందనే నమ్మకం లేదని చెప్పారు. మరి ఆ రేంజ్ లో కొరటాల శివ.. విజయశాంతి కోసం క్యారెక్టర్ రాస్తే మాత్రం ఆమె నటించే అవకాశాలు ఉన్నాయి. మరేం జరుగుతుందో చూడాలి. మరోపక్క ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు సానా ఎదురుచూస్తున్నారు. మరి ఆయనతో సినిమా ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి!

News ReelsPublished at : 06 Nov 2022 05:28 PM (IST) Tags: Koratala siva NTR30 NTR Sabu Cyril Ratnavelu

సంబంధిత కథనాలు

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Baba New Trailer: రజినీకాంత్ ‘బాబా’ మూవీ రి-రిలీజ్, కొత్త ట్రైలర్ చూశారా?

Baba New Trailer: రజినీకాంత్ ‘బాబా’ మూవీ రి-రిలీజ్, కొత్త ట్రైలర్ చూశారా?

Keerthy Suresh New Movie : కీర్తి సురేష్‌తో 'కేజీఎఫ్', 'కాంతార' నిర్మాత సినిమా - 'రఘు తాత'

Keerthy Suresh New Movie : కీర్తి సురేష్‌తో 'కేజీఎఫ్', 'కాంతార' నిర్మాత సినిమా - 'రఘు తాత'

Pawan Kalyan Next Movie : పవన్‌తో హరీష్ శంకర్ సినిమా ఆగలేదు - వచ్చే వారమే పూజ, సంక్రాంతి తర్వాత

Pawan Kalyan Next Movie : పవన్‌తో హరీష్ శంకర్ సినిమా ఆగలేదు - వచ్చే వారమే పూజ, సంక్రాంతి తర్వాత

RRR Oscar Entry: ఆ సమయంలో చాలా నిరాశ చెందా, ‘ఆర్‌.ఆర్.ఆర్’ ఆస్కార్‌కు ఎంపికపై విజయేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

RRR Oscar Entry: ఆ సమయంలో చాలా నిరాశ చెందా, ‘ఆర్‌.ఆర్.ఆర్’ ఆస్కార్‌కు ఎంపికపై విజయేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

President Droupadi Murmu : ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది, దేశాభివృద్ధిలో కీలక పాత్ర- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

President Droupadi Murmu :  ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది, దేశాభివృద్ధిలో కీలక పాత్ర- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

Navy Day History: భారత నేవీ వైజాగ్‌లో పేల్చేసిన పాక్ సబ్ మెరైన్ "ఘాజీ "కీ అమెరికాకు లింకేంటి ? ఘాజీ శకలాలను చూస్తారా !

Navy Day History: భారత నేవీ వైజాగ్‌లో పేల్చేసిన పాక్ సబ్ మెరైన్

Mlc Kavitha Meets CM KCR : సీఎం కేసీఆర్ తో మరోసారి ఎమ్మెల్సీ కవిత భేటీ, సీబీఐ నోటీసులపై చర్చ!

Mlc Kavitha Meets CM KCR :  సీఎం కేసీఆర్ తో మరోసారి ఎమ్మెల్సీ కవిత భేటీ, సీబీఐ నోటీసులపై చర్చ!

IND vs BAN 1st ODI: ఐదు వికెట్లతో మెరిసిన షకీబ్- ఓ మోస్తరు స్కోరుకే ఆలౌట్ అయిన టీమిండియా

IND vs BAN 1st ODI: ఐదు వికెట్లతో మెరిసిన షకీబ్- ఓ మోస్తరు స్కోరుకే ఆలౌట్ అయిన టీమిండియా