By: ABP Desam | Updated at : 22 Nov 2022 10:01 AM (IST)
ఎన్టీఆర్, రామ్ చరణ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR Jr) కథానాయకుడిగా సినిమా చేయాలనేది 'ఉప్పెన' దర్శకుడు సానా బుచ్చి బాబు (Buchi Babu Sana) కోరిక. దానికోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. 'ఉప్పెన' వంద కోట్లకు పైగా వసూలు చేసింది. కొత్త హీరో, కొత్త దర్శకుడి సినిమాకు అన్ని వసూళ్లు రావడం ఓ రికార్డు. 'ఉప్పెన' తర్వాత బుచ్చి బాబుకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, ఆయన ఎన్టీఆర్ కోసం ఎదురు చూశారు. ఇప్పుడు ఆ ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ రామ్ చరణ్ (Ram Charan) దగ్గరకు వెళ్ళారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ కథతో చరణ్ దగ్గరకు...
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ సినిమా ఏదీ సెట్స్ మీదకు వెళ్ళలేదు. 'ఆర్ఆర్ఆర్' విడుదలకు ముందు దర్శకుడు కొరటాల శివతో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయడానికి అంగీకరించారు. తనకు రచయితగా 'బృందావనం', దర్శకుడిగా 'జనతా గ్యారేజ్' వంటి హిట్స్ ఇచ్చిన కొరటాలకు సినిమా చేస్తానని మాట ఇచ్చారు. అయితే... అనుకున్న సమయానికి ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఈలోపు ఎన్టీఆర్ మరో సినిమా చేసే అవకాశం ఉంది. ఒకానొక సమయంలో కొరటాల శివ సినిమా పక్కన పెట్టి... బుచ్చి బాబు సనా సినిమా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపించింది. అయితే... ఆయన అలా చేయలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి మరో సినిమా స్టార్ట్ చేయకుండా కొరటాలకు టైమ్ ఇచ్చారు. మరో వైపు చాలా రోజుల నుంచి ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తున్న బుచ్చి బాబు, మరింత కాలం వెయిట్ చేయాల్సి వస్తుండటంతో రామ్ చరణ్ దగ్గరకు వెళ్ళారని సమాచారం.
ఎన్టీఆర్ కోసం బుచ్చి బాబు సానా ఏ కథ అయితే రెడీ చేశారో... అదే కథతో రామ్ చరణ్ హీరోగా సినిమా తీయడానికి రెడీ అయ్యారు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ మేళవించి మాంచి స్క్రిప్ట్ రెడీ చేశారట. దానికి బుచ్చి బాబు గురువు సుకుమార్ అండదండలు ఉన్నాయి.
చరణ్ - బుచ్చి బాబు సినిమాకు కొత్త నిర్మాత!
సానా బుచ్చి బాబును 'ఉప్పెన'తో దర్శకుడిగా పరిచయం చేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, దర్శకుడిగా అతని రెండో సినిమా కూడా ప్రొడ్యూస్ చేయడానికి ప్లాన్ చేసింది. ఎన్టీఆర్‌తో అతడి సినిమా ప్రపోజ్ చేసింది మైత్రీ అధినేతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్. ఇప్పుడు రామ్ చరణ్ - బుచ్చి బాబు సినిమాను వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం లేదని తెలిసింది. వాళ్ళకు సన్నిహితులైన సతీష్ కిలారు పాన్ ఇండియా స్థాయిలో, 150 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారట. త్వరలో ఈ సినిమా గురించి అధికారికంగా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Also Read : ఓ తరం వెళ్ళిపోయింది - ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు, ఇప్పుడు కృష్ణ
ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... కొరటాల శివ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయడానికి యంగ్ టైగర్ రెడీ అవుతున్నారు. అది వచ్చే ఏడాది విడుదల అవుతుందా? 2024 సంక్రాంతికి వెళుతుందా? అనేది షూటింగ్ స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. 'దిల్' రాజు, శిరీష్ నిర్మాతలుగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా స్టార్ట్ చేసిన రామ్ చరణ్, దాంతో పాటు బుచ్చి బాబు సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదీ సంగతి!
Krishna Mukunda Murari promo: కృష్ణని పేరు పెట్టి పిలిచిన మురారి.. గతం గుర్తుకురావడంతో టెన్షన్ పడుతున్న ముకుంద!
Brahmamudi Promo: కావ్య రాజ్ ముందు అడ్డంగా బుక్కైనా రాహుల్.. రేపటి ఎపిసోడ్లో రుద్రాణికి చుక్కలే!
Guppedantha Manasu Promo: రిషిధార అభిమానులకు పండుగలాంటి ఎపిసోడ్.. రిషి వసు మధ్య సూపర్ సీన్!
Krishna Mukunda Murari November 28th Episode : ముకుంద ప్రేమలో మురారి.. భవాని పెళ్లి ప్రపోజల్ .. కృష్ణ పరిస్థితేంటి!
'హాయ్ నాన్న'లో శృతి సాంగ్, రష్మిక కొత్త సినిమా, 'యానిమల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల
Uttarakhand Tunnel Rescue: టన్నెల్ రెస్క్యూ పనులు పూర్తి, మరికాసేపట్లో బయటకు రానున్న 41మంది కార్మికులు: సీఎం ధామి
Telangana Elections 2023 : కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !
Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు
/body>