NTR: 'నా భార్య గేట్ దగ్గర ఉంటుందేమోనని చరణ్ భయపడుతుంటాడు' ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రామ్ చరణ్ తో తన స్నేహం ఎలా మొదలైందో..? ఎందుకు ఇంత స్ట్రాంగ్ బాండ్ క్రియేట్ అయిందో ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్ గా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ షురూ చేశారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది టీమ్. రీసెంట్ గా దర్శకుడు అనిల్ రావిపూడి.. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ఇంటర్వ్యూ చేశారు.
ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ బాగా వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో తమ స్నేహం ఎలా మొదలైందో..? ఎందుకు ఇంత స్ట్రాంగ్ బాండ్ క్రియేట్ అయిందో ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. నిజానికి వీరిద్దరూ రెండు ద్రువాలనే చెప్పాలి. ఒకరు నందమూరి కుటుంబానికి చెందిన వారైతే.. మరొకరు మెగా ఫ్యామిలీకి చెందిన హీరో. తొలిసారి వీరిద్దరూ కలిసి 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ తో స్నేహం గురించి చెప్పారు ఎన్టీఆర్.
భిన్న ద్రువాలు ఆకర్షించుకుంటాయనేది తమ విషయంలో నిజమైందని అన్నారు ఎన్టీఆర్. అగ్ని పర్వతం బద్దలైపోతున్నా.. చాలా కామ్ గా ఉండే క్వాలిటీ చరణ్ లో ఉందని.. అక్కడే చరణ్ పై గౌరవం, ఇష్టం ఏర్పడ్డాయని చెప్పారు ఎన్టీఆర్. స్టార్ క్రికెట్ పోటీలు జరుగుతున్న సమయంలో చరణ్ తో కలిసి వెళ్లానని.. ఒకరినికొకరం బాగా అర్ధం చేసుకున్నామని చెప్పారు. ఆ విధంగా ఎవరికీ తెలియని బలమైన స్నేహం ఏర్పడిందని చెప్పుకొచ్చారు.
వారి బంధం గురించి చెబుతూ.. ఓ ఉదాహరణ ఇచ్చారు ఎన్టీఆర్. ''మార్చి 26న నా భార్య ప్రణతి పుట్టినరోజు. చరణ్ బర్త్ డే 27న. మార్చి 26 రాత్రి 12 గంటలకు చరణ్ కారు మా ఇంటి గేట్ ముందు ఉంటుంది. వెంటనే నేను చరణ్ కారు ఎక్కి వెళ్లిపోతా.. ఇలా చాలా ఏళ్లు చరణ్ పుట్టినరోజులు సెలబ్రేట్ చేశాం. కానీ ఎవరికీ తెలియదు. మా ఆవిడ ఫోన్ చేసి ఎక్కడున్నారని అడుగుతుంది. మార్చ్ 26 అయిపోయింది కదా అని చెప్తా. పాపం చరణ్.. గేట్ దగ్గర ప్రణతి ఉంటుందోమోనని భయపడుతుంటాడు'' అంటూ చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.
View this post on Instagram