అన్వేషించండి
Advertisement
Roar of RRR In Mumbai: గాల్లోంచి అలా అలా... ఎన్టీఆర్, చరణ్ ఎంట్రీ అదుర్స్ అంతే! మీరూ వీడియో చూడండి!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టేజి మీద ఎంట్రీ ఇచ్చినప్పుడు మాటలు రాలేదని ఫ్యాన్స్ అంటున్నారు.
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా ఫంక్షన్ ఆదివారం రాత్రి ముంబై మహా నగరంలో జరిగింది. సాధారణంగా సినిమా ఈవెంట్స్ లైవ్ ఇస్తారు. కానీ, 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ ఇన్ ముంబై' పేరుతో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌ను లైవ్ టెలికాస్ట్ చేయలేదు. కానీ, గ్రాండ్‌గా చేశారు. అసలు... స్టేజి మీదకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలా అలా గాల్లోంచి ఎంట్రీ ఇస్తే చూడటానికి రెండు కళ్లు చాల్లేదని, నోట మాట రాలేదని తెలుగు రాష్ట్రాల నుంచి ముంబై వెళ్లిన అభిమానులు చెబుతున్నారు. రామ్ చరణ్ అభిమానులు స్టేజి మీదకు ఇద్దరు హీరోల ఎంట్రీ వీడియో తీసి ట్వీట్ చేశారు. కార్యక్రమంలో వాళ్లిద్దరి ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలుస్తోంది. అలాగే, ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
'ఆర్ఆర్ఆర్' ప్రచార చిత్రాలు చూస్తే... ఎన్టీఆర్ బండి నడుపుతూ, రామ్ చరణ్ గుర్రం మీద స్వారీ చేస్తూ కనిపిస్తారు. స్టేజి మీద సినిమాలో సీన్స్ రిఫ్లెక్ట్ చేసేలా హీరోస్ ఎంట్రీ డిజైన్ చేశారు రాజమౌళి. స్పెషల్‌గా రామ్ చరణ్ కోసం గుర్రం తరహాలో ఒకటి, ఎన్టీఆర్ కోసం బైక్ లాంటిది డిజైన్ చేశారు. వాటి మీద ఇద్దరూ గాల్లోంచి అలా అలా స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చారు. తర్వాత చేయి చేయి కలిపారు. నేపథ్యంలో దోస్తీ సాంగ్ వినిపించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ హిందీ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా అటెండ్ అయ్యారు. ఆయన హోస్ట్ చేశారు. డిసెంబర్ 31న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఈవెంట్ టెలికాస్ట్ కానుందని సమాచారం.
తెలుగు రాష్ట్రాల నుంచి ముంబై వెళ్లిన అభిమానుల హుషారు, జోరు మధ్య ఈవెంట్ సందడి సందడిగా జరిగిందని తెలుస్తోంది. జనవరి 7న 'ఆర్ఆర్ఆర్' తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన కార్యక్రమానికి హీరోయిన్లు ఆలియా భట్, శ్రియా శరణ్ కూడా అటెండ్ అయ్యారు.
Also Read: నో ఛేంజ్... 'ఆచార్య' వెనక్కి వెళ్లడం లేదు! మరి, 'భీమ్లా నాయక్' సంగతేంటి?
Also Read: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే.. ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు
Also Read: బాలకృష్ణ వీక్‌నెస్ మీద కొట్టిన రాజమౌళి
Also Read: మహేష్ బాబుకు ఇష్టమైన కో-డైరెక్టర్... దర్శకుడిగా కోలీవుడ్‌లో సత్తా చాటాడోయ్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
DOSTI 🔥🤝🌊@AlwaysRamCharan @tarak9999 #RamCharanInMumbaiForRRR pic.twitter.com/4ewCVsiIzu
— Trends RamCharan™ (@TrendsRamCharan) December 19, 2021
The Mega Power Entry 🌟🔥🔥🔥#RamCharanInMumbaiForRRR@AlwaysRamCharan pic.twitter.com/OuTVKbAW5l
— Trends RamCharan™ (@TrendsRamCharan) December 19, 2021
Also Read: వాసివాడి తస్సాదియ్యా... పిల్లజోరు అదిరిందయ్యా!That Response For @AlwaysRamCharan 😈🔥😎#RamCharanInMumbaiForRRR #ManOfMassesRamCharan pic.twitter.com/CAUblWbDi3
— Exclusive ChaRRRan Fans™ (@Team_ECF) December 19, 2021
Also Read: నో ఛేంజ్... 'ఆచార్య' వెనక్కి వెళ్లడం లేదు! మరి, 'భీమ్లా నాయక్' సంగతేంటి?
Also Read: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే.. ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు
Also Read: బాలకృష్ణ వీక్‌నెస్ మీద కొట్టిన రాజమౌళి
Also Read: మహేష్ బాబుకు ఇష్టమైన కో-డైరెక్టర్... దర్శకుడిగా కోలీవుడ్‌లో సత్తా చాటాడోయ్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion