Nithiin: నితిన్ తో వక్కంతం వంశీ కొత్త ప్రాజెక్ట్, ఈసారైనా హిట్ కొడతాడా?
యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో సినిమా మొదలుపెట్టారు వక్కంతం వంశీ. ఈరోజే ఈ సినిమా పూజాకార్యక్రమాలను నిర్వహించారు.
రచయితగా ఎన్నో సినిమాలకు పని చేసిన వక్కంతం వంశీ.. 'నా పేరు సూర్య' సినిమాతో దర్శకుడిగా మారారు. 2018లో విడుదలైన ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించారు. ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్లు బాగుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. బన్నీ కెరీర్ లో ఇదొక డిజాస్టర్. దీంతో వక్కంతం వంశీ దర్శకుడిగా మరో అవకాశం రాలేదు.
మళ్లీ ఇన్నాళ్లకు తన కొత్త ప్రాజెక్ట్ ను మొదలుపెట్టారు. యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో సినిమా మొదలుపెట్టారు. ఈరోజే ఈ సినిమా పూజాకార్యక్రమాలను నిర్వహించారు. అయితే రెగ్యులర్ షూటింగ్ మొదలుకావడానికి మరో రెండు, మూడు నెలల సమయం పడుతుంది. ఈ సినిమాకి 'జూనియర్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాను నితిన్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్నారు. చాలా కాలం తరువాత హారీస్ జయరాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సాయిశ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తరువాత వక్కంతం వంశీ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నారు. మరి ఈసారైనా వక్కంతం వంశీ దర్శకుడిగా హిట్ అందుకుంటారేమో చూడాలి!
Also Read: రేవ్ పార్టీపై టాస్క్‌ఫోర్స్ దాడులు - బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్
More than elated to announce my next project with dearest brother @actor_nithiin ❤️
— Vakkantham Vamsi (@VamsiVakkantham) April 3, 2022
Looking forward to this journey with my highly talented team 🤗🤗@sreeleela14 @Jharrisjayaraj#SaiSrinivas @SreshthMovies @sahisuresh #RajkumarAkella #SudhakarReddy #NikithaReddy #Nithiin32 pic.twitter.com/SOUkmHTTlu
Happy to collaborate with @VamsiVakkantham garu for my next one #Nithiin32 :))
— nithiin (@actor_nithiin) April 3, 2022
This is going to be a very special one 😊
Shoot begins soon !
Hoping to have all your love & blessing as always ♥️@sreeleela14 @Jharrisjayaraj #SudhkarReddy #NikhithaReddy @SreshthMovies pic.twitter.com/kWXLw6VLKD