Macherla Niyojakavargam Trailer: ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ - చేతిలో టీ గ్లాస్, రాజమౌళి హీరోలా ఎలివేషన్!
నితిన్, కృతిశెట్టి జంటగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ట్రైలర్ శనివారం విడుదలైంది.
హీరో నితిన్ సినిమా థియేటర్లో విడుదలై చాలా రోజులవుతుంది. ఓటీటీలో విడుదలైన ‘మ్యాస్ట్రో’ తర్వాత.. నితిన్ చాలా టైమ్ తీసుకుని ‘మాచర్య నియోజకవర్గం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సారి నితిన్ కాస్త భిన్నమైన పాత్రను ఎంచుకున్నాడు. ఐఏఎస్ అధికారిగా.. గుంటూరు కలెక్టర్ ఎన్.సిద్దార్థ్ రెడ్డిగా నితిన్ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ అంచనాలు పెంచేసింది.
ఆగస్టు 12న ‘మాచర్ల నియోజకవర్గం’ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ‘మాచర్ల నియోజవర్గం’లో ఎన్నికలు జరిపించే నేపథ్యంలో కలెక్టర్ సిద్దార్థ్.. అక్కడి ఎమ్మెల్యే రాజప్ప(సముద్రఖని)తో పెట్టుకుంటాడు. రాజప్ప ఆకట్టించేందుకు ప్రభుత్వ అధికారిగా సిద్దార్థ్ తన అధికారం, బుద్ధిబలాన్నే కాకుండా కండబలంతో రాజప్పను ఎదుర్కోవల్సి వస్తుంది.
ఈ నేపథ్యంలో ఫైట్స్ సందర్భంలో నితిన్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ‘‘నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్‌లా పంచ్‌లు. వీళ్లేమో బోయపాటి శ్రీనులా యాక్షన్లు. ఇప్పుడు నేనేం చేయాలి? రాజమౌళి హీరోలా ఎలివేషన్ ఇవ్వాలా?’’ వంటి డైలాగ్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటాయి. ‘‘జింక ఎంత పరిగెట్టినా పులి పంజాకు చిక్కాల్సిందే’’ అనే రాజప్ప డైలాగ్‌కు.. ‘‘పులి, జింకా, తొక్కాతోలని అంటే బొక్కలో వేసి తొక్కించేస్తా నా కొడకా’’ అంటూ కౌంటర్ ఇవ్వడం వంటి సీన్స్ కూడా నచ్చుతాయి. ‘‘కలెక్టర్‌పై చెయ్యేస్తే గవర్నమెంట్ మీద చేయ్యేసినట్లే’’, ‘‘వీరప్పా, తొక్కప్ప నా బొంగప్పా ఎవరికైనా ఇదే నా పనిష్మెంట్’’, ‘‘సివిల్ స్వర్వెంట్స్ అందరూ సాఫ్ట్ అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. నేను ఇన్‌బిల్ట్ కమర్షియల్ అమ్మా, డైరెక్టర్ యాక్షనే’’ అనే డైలాగ్స్ ట్రైలర్‌లో ఉన్నాయి. చివర్లో చేతిలో టీ కప్పు పట్టుకుని నితిన్ కనిపించే సీన్ చూస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు వెంటనే అర్థమైపోతుంది.. ఆ సీన్ ఎందుకు ఉందనేది.
Also Read: ‘అబ్బా అబ్బా’ సాంగ్.. సుధీర్, దీపిక పిల్లి రొమాన్స్ - రాఘవేంద్రరావు పాటంటే ఆ మాత్రం ఉండాలి
ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవతున్నారు. ఇప్పటివరకు ఆయన పలు సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు. ఈ సినిమాలో కృతిశెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ పతాకాలపై ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందించారు.