News
News
వీడియోలు ఆటలు
X

‘డెడ్ పిక్సెల్స్’ ట్రైలర్: నిహారిక వెబ్ సీరిస్ - కాస్త స్పైసీ, మరికాస్త క్రేజీ

మెగా డాటర్ నిహారిక 'డెడ్ పిక్సెల్స్' తో మరోసారి యాక్టింగ్ ఫీల్డ్ లోకి దిగగా.. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా ఈ సిరీస్ మే 19న డిస్నీ+ హాట్‌స్టార్ లో విడుదల కానుంది.

FOLLOW US: 
Share:

Dead Pixels Trailer : ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తోన్న 'డెడ్ పిక్సెల్స్' వెబ్ సిరీస్ మెగా డాటర్ మరోసారి తన లక్ పరీక్షించుకోడానికి వచ్చేస్తోంది. తాజాగా ఈ సీరిస్ ట్రైరల్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

ఈ వెబ్ సీరిస్‌లో నిహారిక కొణిదెలతో పాటు వైవా హర్ష, అక్షయ్‌ లింగుస్వామి, సాయి రోణక్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మే 1న రిలీజ్ చేసిన 'డెడ్ పిక్సెల్స్' టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. వీడియో గేమ్‌ల్లో పడి యువత ఎంతగా ప్రభావితమవుతున్నారనేది ఈ సిరీస్ లో చూపించబోతున్నట్టు తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది.

ఈ ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలకు ప్రేక్షకులు తప్పకుండా ఆకర్షితులవుతారు. ముఖ్యంగా యూత్‌కు నచ్చుతుంది. 'బ్యాటిల్ ఆఫ్ థ్రోన్స్' అనే గేమ్ ద్వారా భార్గవ్, ఆనంద్, గాయత్రి అనే మూడు క్యారెక్టర్ల మధ్య సాగే కథాంశంగా ఈ సిరీస్ ను రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ టీజర్ లో నిహారికతో పాటు అక్షయ్ లంగుసాని, వైవాహర్ష, సాయి రోనాక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ గేమ్ ఆడుతూనే వీరంతా మంచి ఫ్రెండ్స్ అవుతారు. అంతలోనే అదే కంపెనీలో రోషన్ కొత్తగా జాయిన్ అవుతాడు.

రోషన్ ని గాయత్రి ప్రేమిస్తుంది. గాయత్రి ఫ్రెండ్ కావడంతో రోషన్ ని కూడా గేమ్ లో జాయిన్ చేసుకుంటారు టీంమేట్స్. ఇక గేమ్ లో xp పాయింట్స్ కోసం గేమ్ లోనే పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అవుతారు గాయత్రి అండ్ భార్గవ్. ఆ పెళ్లి తర్వాత భార్గవ్ గాయత్రిని నిజంగానే భార్యగా ఫీల్ అవుతాడు. కానీ గాయత్రి మాత్రం రోషన్ వెనుక పడుతుంది. అలా గేమ్ వెనుకబడిన ఆ నలుగురి జీవితాలు చివరికి ఏమయ్యాయి అనేది అసలు కథగా అని తెలుస్తోంది. టీజర్ చివర్లో గేమ్ కోసం ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తున్నారని చెప్పే డైలాగ్ ప్రేక్షకుల్ని మరింత కట్టిపడేస్తోంది.

ఈ సిరీస్ టెక్నికల్ క్రూ విషయానికి వస్తే... ఈ సిరీస్‌కు కథ, స్క్రీన్‌ప్లేలను అక్షయ్ పొల్ల అందించారు. ఆదిత్య మందల దర్శకత్వం వహించారు. సిద్ధార్థ్ సదాశివుని సంగీతం అందించారు. బీబీసీ స్టూడియోస్ ఇండియా, తమడ మీడియా సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మించారు.

ఇదిలా ఉండగా ఇప్పుడిప్పుడే మరోసారి యాక్టింగ్ వైపు దృష్టి మరల్చిన నిహారిక.. సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ నటించిన ‘పుష్ప 2’లో ఓ గిరిజన యువతి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. 'పుష్ప పార్ట్ 1'తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న బన్నీ.. ఇప్పుడు 'పుష్ప-2'తో మరోసారి తన పర్ఫార్మెన్స్‌ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ ‌తో నిర్మిస్తోంది.

Published at : 09 May 2023 05:17 PM (IST) Tags: Niharika Disney Plus Hotstar Web Series Dead Pixels Trailer Game of Thrones

సంబంధిత కథనాలు

Varun Tej Engagement: ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం - వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి

Varun Tej Engagement: ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం - వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి

Hitler Movie: ‘హిట్లర్’ మూవీని ముందు ఆ హీరోతో అనుకున్నాం - కుట్ర జరిగింది: రైటర్ మరుధూరి రాజా

Hitler Movie: ‘హిట్లర్’ మూవీని ముందు ఆ హీరోతో అనుకున్నాం - కుట్ర జరిగింది: రైటర్ మరుధూరి రాజా

Ayesha Shroff: రూ.58 లక్షలు మోసపోయిన హీరో తల్లి, కిక్ బాక్సర్ అరెస్ట్ - ఇంతకీ ఏమైంది?

Ayesha Shroff: రూ.58 లక్షలు మోసపోయిన హీరో తల్లి, కిక్ బాక్సర్ అరెస్ట్ - ఇంతకీ ఏమైంది?

Maya Petika Movie: పాయల్ రాజ్ పుత్ ‘మాయా పేటిక’ వచ్చేస్తుంది - విడుదల ఎప్పుడంటే?

Maya Petika Movie: పాయల్ రాజ్ పుత్ ‘మాయా పేటిక’ వచ్చేస్తుంది - విడుదల ఎప్పుడంటే?

Punch Prasad: ‘జబర్దస్త్’ పంచ్ ప్రసాద్‌కు ఏమైంది? రెండు కిడ్నీలు పాడవ్వడానికి కారణం అదేనా?

Punch Prasad: ‘జబర్దస్త్’ పంచ్ ప్రసాద్‌కు ఏమైంది? రెండు కిడ్నీలు పాడవ్వడానికి కారణం అదేనా?

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్