News
News
వీడియోలు ఆటలు
X

Pushpa 2 Movie: ‘పుష్ప 2’లో నిహారిక, గిరిజన అమ్మాయి పాత్రలో మెగా డాటర్ ఫిక్స్?

అల్లు అర్జున్ ‘పుష్ప 2’ నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో మెగా డాటర్ నిహారిక కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. గిరిజన అమ్మాయిగా ఆమె కనిపించనుందట.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా లెవల్లో దుమ్మురేపిన చిత్రం 'పుష్ప’. ఎలాంటి అంచనాలు లేకుండా హిందీలో రిలీజైన ఈ సినిమా, బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంచనలం సృష్టించింది. సుకుమార్ డైరెక్షన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలోని డైలాగులు, పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తొలి భాగం దేశ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు అందరి దృష్టి 'పార్ట్ 2' పైనే పడింది. ఈ సినిమాపైనా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెరిగాయి.

‘పుష్ప 2’లో నిహారిక కీలక పాత్ర!

 2023లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది ‘పుష్ప 2’. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్, స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ టాక్ వినిపిస్తోంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల ‘పుష్ప ది రూల్‌’లో కీలక పాత్ర కోసం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ పాత్ర కోసం స్టార్ హీరోయిన్  సాయి పల్లవిని చిత్రం బృందం సంప్రదించిందట. అయితే, ఆమె ఈ క్యారెక్టర్ చేసేందుకు ఒప్పుకోలేదట. ఈ నేపథ్యంలో ఆ పాత్ర కోసం నిహారిక పేరు పరిశీలిస్తున్నారట. ఆల్మోస్ట్ ఆమెను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఓ గిరిజన అమ్మాయి పాత్రలో నిహారిక కనిపించనున్నట్లు తెలుస్తోంది.    

గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్న నిహారిక

గత కొంత కాలంగా నిహారికి వ్యక్తిగత జీవితం గురించి పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  తన భర్త చైతన్య నుంచి దూరంగా ఉంటుందని, త్వరలోనే విడాకులు తీసుకోబోతుందనే వార్తలు వస్తున్నాయి. భార్య భర్తల నడుమ వచ్చిన గొడవలు విడాకులకు కారణం అవుతున్నాయని తెలుస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఒకరికొకరు అన్ ఫాలో చేసుకోవడం, పెళ్లి ఫోటోలను  డిలీట్ చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరుతుంది. ఈ అంశంపై అటు చైతన్య, ఇటు మెగా ఫ్యామిలీ రియాక్ట్ కాకపోవడంతో విడాకులు నిజమే అనే వార్తలు వినిపిస్తున్నాయి.  2020 డిసెంబర్ 9న నిహారిక పెళ్లి రాజస్థాన్ లోని ఉదయ్ గఢ్ ప్యాలెస్ లో అంగరంగ వైభవం గా జరిగింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ‘పుష్ప’ పలు భాషల్లోనూ బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో బన్నీకు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. మ‌ల‌యాళ స్టార్ హీరో ఫాహ‌ద్ ఫజిల్  కీలక పాత్రలో న‌టించిన ఈ సినిమాలోని డైలాగులు, మేనరిజమ్, పాటలు ప్రపంచ వ్యాప్తంగా  పాపులర్ అయ్యాయి. సినీ సెల‌బ్రెటీల నుంచి పలువురు క్రికెట‌ర్స్‌, రాజ‌కీయ నాయ‌కుల వ‌ర‌కు..   ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమాలోని డైలాగ్స్‌, హూక్ స్టెప్స్‌ను రీల్స్‌ గా చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ అయ్యారు. ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 16 ,2023న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Published at : 07 May 2023 11:22 AM (IST) Tags: Niharika Konidela Pushpa 2 Tribal Girl Role Pushpa The Rule Movie

సంబంధిత కథనాలు

థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం సందడి చేసే సినిమాలు ఇవే!

థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం సందడి చేసే సినిమాలు ఇవే!

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!

త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!

Sulochana Passes Away: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, అలనాటి మేటి నటి సులోచన లట్కర్ కన్నుమూత

Sulochana Passes Away: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, అలనాటి మేటి నటి సులోచన లట్కర్ కన్నుమూత

Pawan Kalyan Movie Kushi: ‘ఖుషి’ మూవీ చూసిన ఊర్వశి, పవర్ స్టార్ మూవీలో స్పెషల్ సాంగ్ కన్ఫామ్ అయినట్లేనా?!

Pawan Kalyan Movie Kushi: ‘ఖుషి’ మూవీ చూసిన ఊర్వశి, పవర్ స్టార్ మూవీలో స్పెషల్ సాంగ్ కన్ఫామ్ అయినట్లేనా?!

టాప్ స్టోరీస్

ఒడిశాలో మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి పడిపోయిన గూడ్స్ ట్రైన్ - కానీ రైల్వేకి సంబంధం లేదట

ఒడిశాలో మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి పడిపోయిన గూడ్స్ ట్రైన్ - కానీ రైల్వేకి సంబంధం లేదట

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

WTC Final 2023: అదిరిందయ్యా రోహిత్‌! కొత్త జెర్సీల్లో టీమ్‌ఇండియా ఫొటోషూట్‌!

WTC Final 2023: అదిరిందయ్యా రోహిత్‌! కొత్త జెర్సీల్లో టీమ్‌ఇండియా ఫొటోషూట్‌!