Netflix Telugu Movies: నెట్‌ఫ్లిక్స్ ఇండియా మాస్టర్ ప్లాన్, ఏకంగా 16 కొత్త తెలుగు సినిమాలు కొనేసిందిగా!
Netflix Telugu Movies: నెట్‌ఫ్లిక్స్ ఇండియా మాస్టర్ ప్లాన్ వేసింది. ఏకంగా 16 కొత్త తెలుగు సినిమాకు సంబంధించి డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసింది.
Netflix Telugu Movies:
ఇతర OTT ప్లాట్ ఫామ్ లతో పోలిస్తే నెట్ ఫ్లిక్స్ ఇండియా వెనుకబడి ఉందనేది వాస్తవం. ఒకటి ధర కారణం కాగా, మరొకటి సరైన భారతీయ కంటెంట్ లేకపోవడం. అయితే, గత ఏడాదిగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా మంచి ఇండియన్ కంటెంట్ ను తీసుకుంటోంది. ఇప్పుడు మరింత దూకుడు కనబరుస్తూ ఏకంగా 16 కొత్త తెలుగు సినిమాలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ దక్కించుకుంది.
16 కొత్త తెలుగు సినిమాలు కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్ ఇండియా తాజాగా 16 కొత్త తెలుగు చిత్రాలకు సంబంధించిన పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. వాటిలో మహేష్ బాబు మూవీ ‘SSMB28’ కూడా ఒకటి. నెట్‌ఫ్లిక్స్ ఇండియా దూకుడు కచ్చితంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కు కలిసి వస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిన తాజా సినిమాల లిస్టులో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ కూడా ఉంది. మెగాస్టార్‌కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ చిత్రం కొనుగోలు ద్వారా భారీగా ప్రయోజనాన్ని పొందాలని ప్రయత్నిస్తోంది.
నెట్ ఫ్లిక్స్ లిస్టులో క్రేజీ సినిమాలు
ఇటీవలి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘ధమాకా’ రైట్స్ కూడా ఈ డిజిటల్ ప్లాట్ ఫామే దక్కించుకుంది. అంతేకాదు.. నెట్‌ఫ్లిక్స్ ఇండియా తాజా సినిమాల లిస్ట్ లో నాని పాన్ ఇండియన్ చిత్రం ‘దసరా’, నిఖిల్ హిట్ మూవీ ‘18 పేజీలు’, కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న ‘అమిగోస్’, సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, వరుణ్ తేజ్ 12 వ చిత్రం (ఇంకా పేరు పెట్టలేదు), సిద్దూ ‘టిల్లూ స్క్వేర్‘, వైష్ణవ్ తేజ్ 4 వ చిత్రం (ఇంకా పేరు పెట్టలేదు) , UV క్రియేషన్స్ అనుష్క మూవీ (ఇంకా పేరు పెట్టలేదు), కిరణ్ అబ్బవరం ‘మీటర్’ ఉన్నాయి.అటు సితార ఎంటర్ టైన్ మెంట్స్ ‘బుట్టబొమ్మ’, సందీప్ కిషన్ ‘బడ్డీ’, కార్తికేయ 8వ చిత్రం, నాగ శౌర్య పేరు పెట్టని సినిమాను కూడా నెట్‌ఫ్లిక్స్ ఇండియా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసింది.
A quick round up of #NetflixLoEmSpecial 👇🥳
— Netflix India (@NetflixIndia) January 14, 2023
Bholā Shankar
Amigos
Buddy
Butta Bomma
Dasara
Dhamaka
Kartikeya 8
Meter
Shri Lakshmi Venkateswara Cinemas' Production No. 6
Idhi maamulu excitement kaadhu. Mega excitement. Vasthundhi evaro thelusukadha!
— Netflix India South (@Netflix_INSouth) January 14, 2023
Bholā Shankar, arriving on Netflix in Telugu, Tamil, Malayalam and Kannada as a post theatrical release! 💥#NetflixPandaga #BholaaShankar #NetflixLoEmSpecial pic.twitter.com/kwwFk4ENfm
నెట్‌ఫ్లిక్స్ ఇండియాకు కలిసి వచ్చేనా?
OTT ప్లాట్ ఫాం మంచి వ్యూహంలో భాగంగానే భారీ సంఖ్యలో కొత్త తెలుగు సినిమాలను కొనుగోలు చేసింది. ఈ నిర్ణయం కచ్చితంగా నెట్‌ఫ్లిక్స్ ఇండియాకు కలిసి రానున్నట్లు నిపుణులు అభిప్రయాపడుతున్నారు. మిగతా ఓటీటీ సంస్థలతో పోటీలో నెట్ ఫ్లిక్స్ ఇండియాకు ఈ సినిమాలు ఏ మేరకు కలిసి వస్తాయో చూడాలి.
Read Also: గోల్డెన్ గ్లోబ్ అవార్డు గ్రహీత MM కీరవాణి స్వరపరిచిన 10 అద్భుత పాటలు ఇవే!