News
News
X

NBK108 Launch : పూజతో మొదలైన బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా - గిప్పడి సంది లెక్కలు టక్కర్

Balakrishna Anil Ravipudi Movie NBK 108 Launch : బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ఈ రోజు ప్రారంభమైంది.

FOLLOW US: 
Share:

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈ రోజు కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. ఆయన హీరోగా షైన్ స్క్రీన్స్ (Shine Screens) సంస్థ భారీ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వినోదంతో పాటు వాణిజ్య విలువలు జోడించి వరుస విజయాలు అందుకుంటున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మాతలు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమాను ప్రారంభించారు. 

NBK 108 Muhurtham : బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు కెమెరా స్విచ్ఛాన్ చేయగా... మరో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలతో ఒకరైన నవీన్ ఎర్నేని, 'దిల్' రాజు సోదరుడు శిరీష్, సతీష్ కిలారు చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు.

బాలకృష్ణ, తమన్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్
బాలకృష్ణ 108వ చిత్రమిది. అందుకని, NBK 108ను వర్కింగ్ టైటిల్‌గా పెట్టారు. ఈ చిత్రానికి తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు 'డిక్టేటర్' చిత్రానికి ఆయన సంగీతం అందించినా... 'అఖండ'తో భారీ విజయం సాధించారు. బాలకృష్ణ, తమన్ కలయికలో 'అఖండ', వీర సింహా రెడ్డి', ఇప్పుడీ సినిమా... లేటెస్ట్ హ్యాట్రిక్ ఇది. 

'వీర సింహ రెడ్డి' టాకీ పూర్తి చేసిన బాలకృష్ణ   
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy) టాకీ పార్ట్ షూటింగును బాలకృష్ణ బుధవారం పూర్తి చేశారు. అందులో సాంగ్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఒక్క పాట అంటే రెండు మూడు రోజులు కేటాయిస్తే సరిపోతుంది. అనిల్ రావిపూడి సినిమాకు ఫుల్ డేట్స్ కేటాయించారని తెలిసింది. 

యాక్షన్ షురూ
NBK 108 Begins : తొలుత పూజా కార్యక్రమాల అనంతరం సినిమా టైటిల్ కూడా ప్రకటిస్తారనే మాట వినిపించింది. అయితే... ఈ రోజు టైటిల్ వెల్లడించలేదు. మరో మంచి ముహూర్తం చూసుకుని టైటిల్ ప్రకటించాలని భావిస్తున్నారట. ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ చిత్రానికి సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్, తమ్మిరాజు ఎడిటర్. 

Also Read : స్టార్ డైరెక్టర్స్ పరువు తీసిన 2022 - ఈ ఏడాది వీళ్ళ స్టార్ బాగోలేదనుకుంట!

View this post on Instagram
 
A post shared by Anil Ravipudi (@anilravipudi)

తండ్రీ కుమార్తెల ఈ సినిమా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. బాలకృష్ణకు ఈ సినిమా కొత్తగా ఉంటుందని, ఆయనకు డిఫరెంట్ ఇమేజ్ తీసుకు వస్తుందని టాక్. ఈ సినిమాలో కుమార్తె పాత్రకు 'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీ లీల (Sree Leela) ఎంపిక అయ్యారు. మరో హీరోయిన్ అంజలి (Anjali) కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఆమెది విలన్ రోల్ అని టాక్.  

అనిల్ రావిపూడి సినిమా తర్వాత కల్ట్ క్లాసిక్ 'ఆదిత్య 369'కి సీక్వెల్ 'ఆదిత్య 999 మ్యాక్' (Aditya 999 Movie) సెట్స్ మీదకు వెళ్ళనుంది. దానికి బాలకృష్ణ స్క్రిప్ట్ రాస్తున్నారు. అంతే కాదు... ఆయనే డైరెక్ట్ చేయనున్నారు (Balakrishna Will Direct Aditya 999).  

Also Read : తెలుగులో ఈ ఏడాది (2022లో) రీమేక్ రాజాలు వీళ్ళే - హిట్టా? ఫట్టా?

Published at : 08 Dec 2022 02:41 PM (IST) Tags: Balakrishna Anil Ravipudi Balakrishna New Movie NBK108 Launch

సంబంధిత కథనాలు

Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!

Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Unstoppable 2: నర్సుపై వివాదాస్పద కామెంట్స్, క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

Unstoppable 2: నర్సుపై వివాదాస్పద కామెంట్స్, క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

Madhavan Audition Clip: ‘3 ఇడియట్స్’ సినిమా కోసం మాధవన్ చేసిన ఆడిషన్ వీడియో చూశారా?

Madhavan Audition Clip: ‘3 ఇడియట్స్’ సినిమా కోసం మాధవన్ చేసిన ఆడిషన్ వీడియో చూశారా?

‘రైటర్ పద్మభూషణ్’ మూవీపై మహేష్ బాబు ట్వీట్ - సుహాస్ భావోద్వేగం!

‘రైటర్ పద్మభూషణ్’ మూవీపై మహేష్ బాబు ట్వీట్ - సుహాస్ భావోద్వేగం!

టాప్ స్టోరీస్

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?

Majilis Congress :  మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ -  వర్కవుట్ అవుతుందా ?

Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్‌ వేసుకొని భర్తతో కాపురం!

Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్‌ వేసుకొని భర్తతో కాపురం!

Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్

Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్