Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!
నయనతార కొత్త సినిమా ‘కనెక్ట్’ ట్రైలర్ ఆన్‌లైన్‌లో విడుదలైంది. హర్రర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు.
నయనతార ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన ఓరియంటెడ్ సినిమా ‘కనెక్ట్’. నయనతారతో గతంలో ‘మాయ (తెలుగులో మయూరి)’, తాప్సీతో ‘గేమ్ ఓవర్’ సినిమాలు రూపొందించిన అశ్విన్ శరవణన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హార్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వాన ఫేమ్ వినయ్ రాయ్, సత్యరాజ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాను రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయనతార స్వయంగా నిర్మిస్తుంది. తెలుగులో ప్రముఖ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. డిసెంబర్ 22వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
ట్రైలర్ విషయానికి వస్తే... కరోనా వైరస్ కారణంగా విధించిన నేషనల్ వైడ్ లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. నయనతార, తన భర్తకి కరోనా వైరస్ సోకుతుంది. ఆ తర్వాత కథ హార్రర్ టర్న్ తీసుకుంటుంది. ఒక డిఫరెంట్ హర్రర్ సినిమాను చూడబోతున్నామని ట్రైలర్ ద్వారానే దర్శక నిర్మాతలు తెలిపారు. పరిమిత బడ్జెట్‌లోనే తెరకెక్కినప్పటికీ సినిమా క్వాలిటీ పరంగా, టెక్నికల్‌గా చాలా బాగుంది.
ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ ఇప్పటికే పూర్తయ్యింది. U/A సర్టిఫికేట్ పొందింది. హార్రర్ సీన్లు సీట్ ఎడ్జ్‌లో కూర్చొబెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ ఆసక్తికర విషయం ఉంది. అదేంటంటే, మొత్తం సినిమా రన్ టైమ్ 99 నిమిషాలు. అయితే, ఇందులో బ్రేక్ ఉండదట. తొలిసారి ఇంటర్వెల్ బ్రేక్ లేకుండా ఓ ప్రయోగం చేయబోతున్నట్లు విఘ్నేష్ శివన్ వెల్లడించారు.
ఇటీవలే విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచారు. ఆ టీజర్‌ను ఒక సారి చూస్తే... కరోనా వైరస్ వల్ల విధించిన లాక్‌డౌన్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. నిర్మానుష్య వీధులు, నిశబ్ద వాతావరణం నుంచి.. ఒక గదిలో మంచంపై కూర్చొని ఉన్న నయన తార కనిపిస్తుంది. ఆ తర్వాత ఎవరో తలుపు కొడుతున్న శబ్దాలు వినిపిస్తాయి. సత్యరాజ్ ఆశ్చర్యంగా ఫోన్లో ఏదో వింటున్నట్లు కనిపించారు.
ఓ చిన్నారి ‘‘అమ్మ వదిలియమ్మా’’ అంటూ తలుపుకొడుతున్న శబ్దాలు విని.. ‘‘సుశాన్ నన్ను ఆ అమ్మాయి దగ్గరకు తీసుకెళ్లు’’ అని అనుపమ్ ఖేర్ అంటారు. దీంతో నయన తార(సుశాన్) ఓ చీకటి గదిలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఓ చిన్నారి మంచానికి కట్టేసి ఉంటుంది. ఇంతలో ఓ భయానక శబ్దం వస్తే నయన్ పైకి చూస్తుంది. సీలింగ్‌పై శిలువ గుర్తులు కనిపిస్తాయి. అవి చూస్తూ మంచం వైపు చూసేసరికి.. ఆ చిన్నారి భయానక రూపంలో కనిపిస్తుంది. దీంతో వెంటనే అనుపమ్ ఖేర్ ఆ గది నుంచి బయటకు వచ్చేయాలని నయన్‌కు చెబుతాడు. ఈ సీన్ చూస్తే తప్పకుండా మీరు ఉలిక్కిపడతారు.
“Turn up the volume & turn off the lights... The devil is here👻”
— UV Creations (@UV_Creations) December 8, 2022
Here is the much awaited Telugu trailer of #Connect.
▶ https://t.co/hiMC5qgdDj#ConnectfromDec22 👻#Nayanthara @AnupamPKher #Sathyaraj #VinayRai @Ashwin_saravana @Rowdy_Pictures @VigneshShivN @UV_Creations pic.twitter.com/iqUWYsH1uf