దసరా మూవీ షూటింగ్‌లో నానికి తప్పిన ప్రమాదం, చిత్రీకరణకు కాసేపు విరామం
Natural Star Nani: దసరా మూవీ చిత్రీకరణ సమయంలో నాని పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది.
Natural Star Nani:
ప్రమాదవశాత్తు బొగ్గు పైన పడిందట..
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. శ్యామ్ సింగరాయ్ లాంటి క్లాసిక్ హిట్ తరవాత అంటే సుందరానికి చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు. మూవీ డివైడ్ టాక్ తెచ్చుకున్నా, నాని మార్క్ యాక్టింగ్‌కి మాత్రం ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం "దసరా" చిత్రంలో నటిస్తున్నారు నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నాని కంప్లీట్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. టీజర్‌తో మూవీ బ్యాక్‌డ్రాప్ ఏంటో చెప్పేశారు. బొగ్గు గనుల చుట్టూ సాగే కథ అని హింట్ ఇచ్చారు. గడ్డం, జుట్టుతో నాని ఎప్పుడూ లేనంత కొత్తగా కనిపించారు ఆ టీజర్‌లో. చాలా రోజుల పాటు ఈ షూటింగ్ నిరంతరాయంగా కొనసాగింది. అయితే మధ్యలో కొంత కాలం విశ్రాంతి తీసుకున్నారు నాని. ఈ మధ్యే షూటింగ్ రీస్టార్ట్ అయింది. ఈ సినిమా షూటింగ్‌లో నానికి పెద్ద ప్రమాదమే తప్పినట్టు తెలుస్తోంది. గోదావరి ఖనిలో చిత్రీకరణ జరుపుకుంటుండగా..బొగ్గు ట్రక్కులోని బొగ్గు అంతా నానిపై పడినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. కాసేపు విరామం ఇచ్చి మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశారట. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.
నాని నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం..
ఈ మధ్యకాలంలో నాని నటించిన సినిమాలు వర్కవుట్ కాకపోవడంతో 'దసరా' సినిమా బిజినెస్ పై ఎఫెక్ట్ పడుతుందని అనుకున్నారు. కానీ ఈ సినిమాకి క్రేజీ డీల్స్ వస్తున్నట్లు సమాచారం. డిజిటల్, హిందీ, శాటిలైట్, అడియో అన్నీ కలిపి రూ.47 కోట్ల మేరకు ఈ సినిమాకి ఆఫర్ వచ్చిందట. ఈ ప్రకారం అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నారట. నాన్ థియేట్రికల్ రైట్స్ కి ఈ రేంజ్ బిజినెస్ జరగడం విశేషమనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ లాంటి తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. నాని నటించిన తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్, నవీన్ నూలి ఎడిటర్.
Also Read: Priyanka Goswami CWG 2022: కామన్వెల్త్ పోడియం మీదకు 'శ్రీ కృష్ణుడు'! పతకం అంకింతమిచ్చిన ప్రియాంక!
Also Read: Friendship Day: ప్రతి ఫ్రెండ్ అవసరమే, కానీ అవసరం కోసం మాత్రమే కాదు