By: ABP Desam | Updated at : 13 Jul 2023 12:30 PM (IST)
Image Credit: Nani/Instagram
సరికొత్త కథాంశాలతో సినిమాలు చేయడంలో నేచురల్ స్టార్ నాని ముందుంటారు. ప్రస్తుతం ఆయన #NANI30 చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతోనే శౌర్యువ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబధించిన టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు.
తండ్రీ, కూతుళ్ల సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు చిత్రబృందం టైటిల్ ఫిక్స్ చేసింది. ‘హాయ్ నాన్న’ అనే పేరును ఖరారు చేసింది. చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో నాని, మృణాల్ ఠాకూర్, నానికి కూతురుగా కనిపించే పాపని మేకర్స్ రివీల్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఒక ఎమోషనల్ స్టోరీగా అర్థం అవుతోంది. ఈ సినిమాలో నాని భార్య దూరం కావడం వల్ల పాపను అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వారి జీవితంలోకి మృణాల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నాన్న గురించి కొన్ని ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. ఇవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే నాన్న ఎమోషన్ తో కూడిన ఓ సినిమాలో నటించారు. గతంలో వచ్చిన ‘జెర్సీ’ సినిమాలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు మళ్లీ అలాంటి కథతోనే ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
కొత్త దర్శకుడు శౌర్యువ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా, శృతిహాసన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం), డా. విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ‘హృదయం’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, సాను జాన్ వరుగీస్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో 5 భాషల్లో థియేటర్లలో విడుదల కాబోతోంది.
ఇక రీసెంట్ గా ‘దసరా’ సినిమాతో నాని బ్లాక్ బస్టర్ అందుకున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా, ‘మహానటి‘ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా ‘దసరా‘ తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. నాని 15 ఏండ్ల సినీ కెరీర్ లో కనీవినీ ఎరుగని బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. రూ. 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ సినిమా నాని కెరీర్ కు మరింత బూస్టింగ్ ఇచ్చినట్లు అయ్యింది. తనకు అద్భుతమైన హిట్ ఇచ్చిన శ్రీకాంత్ తో మరో సినిమా చేసేందుకు నాని రెడీ అవుతున్నారు. మంచి కథ రెడీ చేయాలని శ్రీకాంత్ కు సూచించారట. శ్రీకాంత్, నాని కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు కూడా ‘దసరా’ నిర్మాతే కంటిన్యూ అవుతున్నారు. హీరో, డైరెక్టర్, నిర్మాత ఓకే కాగా, హీరోయిన్ కీర్తి సురేషన్ ను కంటిన్యూ చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: షారుఖ్, నయన్ రొమాన్స్‌పై విగ్నేష్ ట్వీట్ - జాగ్రత్తగా ఉండాలంటూ బాద్‌షా వార్నింగ్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Devil Movie: ‘డెవిల్’ కోసం కళ్యాణ్‌రామ్‌కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్‌తో!
‘సరిపోదా శనివారం’ రిలీజ్ అప్‌డేట్, ‘నాసామిరంగ’ ఫస్ట్ సింగిల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Samantha: బాలీవుడ్ రియాలిటీ షోలో సమంత - స్టేజీపై హైదరాబాదీ ర్యాపర్‌తో హల్‌చల్!
Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
Dhiraj Sahu IT Raids Money: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నగదు రూ.318 కోట్లు, ఇంకా 40 సంచులు పెండింగ్!
/body>