అన్వేషించండి
Advertisement
Ante Sundaraniki: 'అంటే సుందరానికి' ఓటీటీ రిలీజ్ - నాని ఏమన్నారంటే?
నాలుగు వారాల థియేట్రికల్ రన్ తరువాత 'అంటే సుందరానికి' ఓటీటీలోకి వచ్చేస్తుందని కథనాలపై నాని రియాక్ట్ అయ్యారు.
ఈ శుక్రవారం విడుదల కాబోతున్న సినిమాల్లో నాని 'అంటే సుందరానికి' సినిమా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచడం లాంటివి చేయకపోవడంతో ఓపెనింగ్స్ బాగా వచ్చే ఛాన్స్ ఉంది. అయితే గత రెండు, మూడు రోజులుగా ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ కి ఇచ్చారని.. నాలుగు వారాల థియేట్రికల్ రన్ తరువాత 'అంటే సుందరానికి' ఓటీటీలోకి వచ్చేస్తుందని కథనాలను ప్రచురించారు.
మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మించిన గత రెండు సినిమాలు నాలుగు వారాలు పూర్తి కాకుండానే ఓటీటీలోకి వచ్చాయి. ఇప్పుడు నాని సినిమా విషయంలో కూడా అదే జరుగుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు హీరో నాని. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన ఆయనకు ఓటీటీ రిలీజ్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.
వీటిపై స్పందించిన నాని.. అసలు ఆ వార్తల్లో నిజం లేదని, బయట వినిపిస్తున్నట్లుగా ఆ ఓటీటీ(అమెజాన్ ప్రైమ్) ప్లాట్ ఫామ్ కి రైట్స్ అమ్మలేదని క్లారిటీ ఇచ్చారు. నాని ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పారంటే నిజమే అయి ఉంటుంది. 'పుష్ప', 'సర్కారు వారి పాట' సినిమాను ఇరవై రోజుల రన్ పూర్తి చేసుకోగానే ఓటీటీలోకి వచ్చేశాయి. 'అంటే సుందరానికి' కూడా అదే బాటలో వెళ్తుందనే ఊహాగానాలు వినిపించాయి.
ఫైనల్ గా ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు నాని. నిజానికి ఇలాంటి ప్రచారాల కారణంగా థియేటర్ కి వెళ్లాలనుకునే ప్రేక్షకులు ఓటీటీలో చూసుకోవచ్చని లైట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మొన్నామధ్య 'అశోకవనంలో అర్జున కళ్యాణం' గురించి కూడా ఇలాంటి ప్రచారమే జరగ్గా.. ఆ విషయాలను నమ్మొద్దంటూ వీడియో రిలీజ్ చేశారు విశ్వక్ సేన్.
Also Read: అంటే థియేటర్లలో నానికి ఎదురు లేదా? ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్లు
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement