Akhanda 2 Thandavam: పాన్ ఇండియా గేమ్‌లో బాలయ్య - ‘అఖండ 2’తో గ్రాండ్ ఎంట్రీకి రెడీ!
Nandamuri Balakrishna: మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘అఖండ 2’తో నందమూరి బాలకృష్ణ పాన్ ఇండియా బరిలోకి దిగనున్నారు. ఇప్పటివరకు రీజనల్ సినిమాలే చేసిన బాలయ్య మొదటి పాన్ ఇండియా సినిమాకు రెడీ అయ్యారు
Balakrishna Pan India Movie: నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణకు తెలుగులో బీభత్సమైన మార్కెట్ ఉంది. కానీ ప్రస్తుతం హీరోలు అందరూ పాన్ ఇండియా బాట పడుతున్నారు. దేశమంతటా తమ గుర్తింపు చాటుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా పాన్ ఇండియా బరిలోకి దిగనున్నారు. ‘అఖండ 2’ నందమూరి బాలకృష్ణకు మొదటి పాన్ ఇండియా సినిమాగా నిలవనుంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది.
హిందీలో ‘అఖండ’కు ఎక్సెలెంట్ రెస్పాన్స్
నందమూరి బాలకృష్ణ ‘అఖండ’కు హిందీలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అఘోరాగా నందమూరి బాలకృష్ణ నటన, లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ ఎపిసోడ్లకు ఓటీటీలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలు ఎలా చేయాలో సౌత్ మేకర్స్‌ను చూసి నేర్చుకోవాలంటూ చాలా మంది బాలీవుడ్‌ను విమర్శించారు కూడా. ఇప్పుడు ‘అఖండ 2’ వస్తుందంటే అక్కడి ఆడియన్స్‌లో కూడా దీని కోసం ఎదురు చూసే వాళ్లు ఉంటారు. బోయపాటి శ్రీను సినిమాలకు కూడా మంచి హిందీ మార్కెట్ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి కంటెంట్ సరిగ్గా క్లిక్ అయితే పాన్ ఇండియా గేమ్‌లో ‘అఖండ 2’ అద్భుతాలు చేయడం ఖాయం.
Read Also: ‘పుష్ప 2’, ఎన్టీఆర్ నీల్ ‘డ్రాగన్’లకు మైత్రీ క్రేజీ డీల్ - బాలీవుడ్‌లో ఇంక జాతరే!
నిర్మాతలు ఛేంజ్...
‘అఖండ’ను ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఇప్పుడు ఈ సీక్వెల్‌ను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించనున్నారు. బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరించనున్నారు.
రిలీజ్ ఎప్పుడు?
ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. డిసెంబర్‌లో ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. బాలయ్య, బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఆ సినిమా కంప్లీట్ అయ్యాక బాలయ్య అఖండ లుక్‌లోకి కూడా మారాల్సి ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ షూటింగ్‌కు ప్రారంభం అవ్వడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అయినా విడుదలకు అప్పటి నుంచి సంవత్సరం వరకు సమయం పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు రిలీజ్ అయినా ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌తో బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయడం మాత్రం ఖాయమని చెప్పవచ్చు!
After a Hat-trick of sensational blockbusters #Simha, #Legend & #Akhanda...
— 14 Reels Plus (@14ReelsPlus) October 16, 2024
The blockbuster combo's #BB4 is #Akhanda2 - Thaandavam 🔱
This time, the EPIC MASSIVE COMBINATION will cause a divine vibration GLOBALLY ❤🔥
Shoot begins soon 💥💥
'GOD OF MASSES'… pic.twitter.com/rWwvSiK90v