Sardar Movie: నాగార్జున చేతికి కార్తీ 'సర్ధార్' సినిమా - రిలీజ్ ఎప్పుడంటే?
కార్తీ నటించిన 'సర్ధార్' సినిమాను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు.
హీరో కార్తీ, 'అభిమన్యుడు' ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను సొంతం చేసుంది. ఇటీవల కాలంలో అన్నపూర్ణ స్టూడియోస్ సినిమాలను సెలక్టివ్ గా పంపిణీ చేస్తూ.. క్యాలిటీ సినిమాలను అందించే నిర్మాణ సంస్థలతో జతకడుతోంది.
కార్తీకి తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉంది. 'అభిమన్యుడు' చిత్రంతో ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు పిఎస్ మిత్రన్. టెక్నాలజీకల్ థ్రిల్లర్స్ అందించడంలో పేరుపొందిన దర్శకుడు 'సర్దార్' ను మరో ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై తమిళంతో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ నటిస్తుండగా.. రజిషా విజయన్, చుంకీ పాండే కీలక పాత్రలలో కనిపించనున్నారు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జివి ప్రకాష్ కుమార్ సంగీత సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. సర్దార్ 2022 దీపావళికి తెలుగు, తమిళంలో థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తుండటంతో సహజంగానే ఈ చిత్రం తెలుగులో భారీ సంఖ్యలో గ్రాండ్ గా థియేటర్ రిలీజ్ కానుంది.
Also Read: అప్పుడు జానీ డెప్ వద్దన్నారు - ఇప్పుడు 'సారీ' చెప్పి రూ.2355 కోట్లు ఇస్తామంటున్నారు!
Also Read: థియేటర్లలో 'పక్కా కమర్షియల్' తెలుగు సినిమాలు - ఓటీటీలో రెజీనా వెబ్ సిరీస్, బాలీవుడ్ డిజాస్టర్ మూవీస్
View this post on Instagram