VirataParvam: 'విరాటపర్వం' నుంచి 'నగాదారిలో' ప్రోమో - రేపే సాంగ్ రిలీజ్
'విరాటపర్వం' సినిమా నుంచి 'నగాదారిలో' అనే సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు.
దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'విరాటపర్వం'. ఈ సినిమాను వేణు ఊడుగుల డైరెక్ట్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది వేసవిలో రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడింది. ముందుగా జూలై 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు సినిమాను చెప్పినదానికంటే ముందుగానే రిలీజ్ చేయబోతున్నారు.
జూన్ 17న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ముందుగా ఈ సినిమా నుంచి 'నగాదారిలో' అనే సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా దీని ప్రోమో వదిలారు. ఇందులో రానా, సాయి పల్లవి కనిపించారు. ఈ పాటను వరంగల్ లోని వీరువాడకి చెందిన జానపద గాయని వరం పాడారు. దేవెర నరేందర్, భరద్వాజ్ లిరిక్స్ అందించారు. రేపు ఉదయం పూర్తి పాటను విడుదల చేయనున్నారు.
ఈ సినిమాలో మావోయిస్టు పాత్రలో రానా కనిపించనున్నారు. ఆయన్ను ప్రేమించే అమ్మాయి పాత్రలో సాయి పల్లవి నటించారు. సాయుధ పోరాటంతో పాటు వీళ్ళిద్దరి మధ్య ప్రేమకథకూ సినిమాలో ప్రాధాన్యం ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరి రావు, సాయి చంద్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
View this post on Instagram