అన్వేషించండి

Naga Chaitanya - Sobhita : ఇఫీ వేడుకల్లో నాగచైతన్య - శోభిత సందడి, రెడ్ కార్పెట్ పై ఫోటోలకు ఫోజులు

Sobhita :ప్రతిష్టాత్మక IFFI 2024 ఫిలిం ఫెస్టివల్ లో అక్కినే ఫ్యామిలీ సందడి చేసింది. నాగ చైతన్య-శోభితతో పాటు నాగార్జున- అమల ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రెడ్ కార్పెట్ మీద ఫోటోలకు పోజులిచ్చి సందడి చేశారు.

IFFI 2024 : ప్రముఖ నటి శోభిత ధూళిపాళ, అక్కినేని నాగ చైతన్య త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే ఎంగేజ్ మెంట్ జరుపుకున్నఈ జంటకు.. వచ్చే నెలలో  పెళ్లి జరగనున్నట్లు తెలుస్తున్నది.  డిసెంబర్ 4న అట్టహాసంగా వీరి వెడ్డింగ్ జరగనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరోవైపు పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారు.  ఇక పెళ్లికి ముందే శోభిత, చైతన్య కలిసి పలు ఈవెంట్లకు జంటగా వెళ్తున్నారు. ఇంట్లో జరిగే వేడుకలతో పాటు బయట జరిగే ఈవెంట్స్ లోనూ పాల్గొంటున్నారు.

IFFI 2024 ఫిలిం ఫెస్టివల్ లో అక్కినేని ఫ్యామిలీ సందడి

ప్రస్తుతం గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా 2024 వేడుక అట్టహాసంగా జరుగుతుంది. ఈ వేడుకలో అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించనున్నారు. ఆయన నటించిన పలు క్లాసిక్ చిత్రాలను ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కినేని ఫ్యామిలీ ఈ వేడుకలకు హాజరైంది. అక్కినేని కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ నటి, చైతన్యకు కాబోయే శ్రీమతి శోభిత ధూళిపాళ కూడా వెళ్లింది. నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ కలిసి రాగా, నాగార్జునతో అమల కలిసి వచ్చింది. వీరంతా కలిసి రెడ్ కార్పెట్ మీద ఫోటోలకు ఫోజులిచ్చారు.  కాబోయే దంపతులు నాగచైతన్య, శోభిత ధూళిపాళ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

ఏఎన్నార్ అవార్డుల వేడులకో స్పెషల్ అట్రాక్షన్ గా శోభిత

రీసెంట్ గా జరిగిన  దివంగత అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని 2024 వేడుకలోనూ శోభిత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. హైదరాబాదు అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమితాబచ్చన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో చైతన్యకు కాబోయే భార్య శోభితా కూడా పాల్గొన్నది. నాగ చైతన్య శోభిత జంట హైలెట్ గా నిలిచింది. ఇద్దరు కలిసి అతిథులను రిసీవ్ చేసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు గోవాలో జరుగుతున్న సినీ వేడుకల్లోనూ ఈ జంట పాల్గొని సందడి చేసింది.

8 రోజుల పాటు కొనసాగనున్న IFFI 2024 ఫిలిం ఫెస్టివల్

ఈ ఏడాది IFFI 2024 ఫిలిం ఫెస్టివల్  8 రోజుల పాటు కొనసాగనుంది. ఈ వేడుకల్లో భారతీయ సినిమా రంగం మీద చెరగని ముద్ర వేసిన నలుగురు ప్రముఖుల శత జయంతి వేడుకల సందర్భంగా వారికి నివాళులర్పించనున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, రాజ్‌ కపూర్‌, గాయకుడు మహమ్మద్‌ రఫీ, బెంగాలీ దర్శకుడు తపన్‌ సిన్హాకు సంబంధించి ఈ వేడుకలో ప్రత్యేకంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Read Also: తోపు లెక్క ఫీల్ అవ్వొద్దన్న ఫైమా... పల్లవి ప్రశాంత్‌పై నోరు పారేసుకున్న గీతూ - సుమ షోలో 'బిగ్ బాస్' మాజీ కంటెస్టెంట్ల రచ్చ

టాప్ హెడ్ లైన్స్

Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget