Naga Chaitanya: అక్కడ రొమాన్స్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డా, షాకింగ్ విషయం చెప్పిన నాగ చైతన్య
నాగ చైతన్య కారులో రొమాన్స్ చేస్తుంటే పోలీసులు చూసేశారట. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా చైతూ చెప్పాడు.
అక్కినేని నాగేశ్వరరావు మనువడిగా, నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు నాగ చైతన్య తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. వైవిధ్యమైన సినిమాలతో తన లక్ పరీక్షించుకుంటున్నాడు. చైతూ ఈ మధ్య సినిమాల కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా న్యూస్ హెడ్ లైన్స్ మారాడు. తన తొలి సినిమా ‘ఏ మాయ చేసావే’ హీరోయిన్ సమంతాతో తొలి చూపులోనే చైతూ ప్రేమలో పడ్డాడు. చాలా కాలం ఆమెతో డేటింగ్ చేశాడు. చివరకు కుటుంబ సభ్యుల అంగీకారంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. సమంతా మెడలో మూడు ముళ్లు వేశాడు. కొంతకాలం పాటు వీరి సంసార జీవితం సంతోషంగానే గడిచింది. ఆ తర్వాతే సమస్యలు మొదలయ్యాయి. ఆమె సినీ కెరీర్ మీద అక్కినేని కుటుంబ సభ్యులు ఆంక్షలు పెట్టడం, తదితర కారణాల వల్ల ఇరువురి మధ్య స్పర్థలు వచ్చినట్లు సమాచారం. దీంతో వారు విడాకులు తీసుకుని ఎవరికి వారు జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
తాజాగా నాగచైతన్య బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. అమీర్ ఖాన్ మెయిన్ రోల్ చేసిన లాల్ సింగ్ చడ్డాలో నాగ చైతన్య మరో కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కొంత మంది ఈ సినిమాను బహిష్కరించాలని సోషల్ మీడియా వేదికగా ఉద్యమం నడుస్తోంది. అయితే, ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. ఈ సినిమా జయపజయాల విషయాన్ని పక్కనబెడితే ఇందులో చైతన్య నటన బాగుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలరాజు పాత్ర పోషించిన చైతన్య.. పాత్రకు తగిన న్యాయం చేశాడంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా నేపథ్యంలో నాగ చైతన్య నేషనల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాడు. పలు చానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఇంతకీ ఆయన ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
వాస్తవానికి నాగ చైతన్య తొలిసారి సమంతాతోనే ప్రేమలో పడ్డాడని చాలా మంది అనుకుంటారు. కానీ.. అంతకు ముందే ఆయనకో ప్రేమాయణం ఉందట. తను కాలేజీ రోజుల్లో ఉండగానే ఓ అమ్మాయితో లవ్ ట్రాక్ నడిపాడట. ఈ విషయాన్ని చైతూనే స్వయంగా చెప్పాడు. తన తొలి ప్రేమలో భాగంగా ఓ రోజు తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి కారులో కూర్చున్నాడట. అదే సమయంలో ఆమెను ముద్దు పెట్టుకున్నాడట. వీరిద్దరు రొమాన్స్ చేస్తుండగా అనుకోని సంఘటన జరిగిందట. అప్పుడే అటుగా వచ్చిన పోలీసులకు ఈ యువ మన్మథుడు దొరికిపోయాడట. కానీ వారు తనను ఏమీ అనలేదట. ఆసమయంలో గర్ల్ ఫ్రెండ్ కు ముద్దు పెడట్టం.. తనకు తప్పుగా అనిపించలేదని చెప్పాడు. కానీ, పోలీసులు చూడ్డమే కాస్త సిగ్గుగా అనిపించిందని తెలిపాడు. నాగ చైతన్య కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరు అనే విషయాన్ని మాత్రం చైతూ వెల్లడించలేదు.
Also Read : ఆమిర్‌పై కోపం హృతిక్ రోషన్ మీదకు - ఒక్క ట్వీట్ ఎంత పని చేసిందో చూశారా?