Lata Mangeshkar: 'లవ్, రెస్పెక్ట్ అండ్ ప్రేయర్స్' లతా మంగేష్కర్ కు రెహ్మాన్, ఇళయరాజా నివాళి
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తో లతా మంగేష్కర్ కి మంచి అనుబంధం ఉంది.
![Lata Mangeshkar: 'లవ్, రెస్పెక్ట్ అండ్ ప్రేయర్స్' లతా మంగేష్కర్ కు రెహ్మాన్, ఇళయరాజా నివాళి Music Directors Condolences to Lata Mangeshkar Lata Mangeshkar: 'లవ్, రెస్పెక్ట్ అండ్ ప్రేయర్స్' లతా మంగేష్కర్ కు రెహ్మాన్, ఇళయరాజా నివాళి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/06/b723730a6394b7a68ec104761c8b5d96_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్(92) ఇక లేరు. ముంబయిలోని సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దాదాపు నెల రోజులుగా ముంబయిలోని సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యం మరింత క్షీణించి కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకి నివాళులు అర్పిస్తున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తో లతా మంగేష్కర్ కి మంచి అనుబంధం ఉంది. రెహ్మన్ మ్యూజిక్ అందించిన 'వందేమాతరం' గీతం దేశభక్తి గీతాల్లో టాప్ రేంజ్‌లో నిలిచింది. ఈ పాటను లతానే ఆలపించారు. దేశభక్తి గీతాలను ఆలపించడంలో కూడా లతా మంగేష్కర్ తనకు తానే సాటి అనిపించుకున్నారు.
లతా మరణవార్త విన్న రెహ్మాన్ సోషల్ మీడియా వేదికగా లతాజీతో తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. 'లవ్, రెస్పెక్ట్ అండ్ ప్రేయర్స్' అంటూ నివాళులు అర్పించారు. గతంలో రెహ్మాన్ ను పొగుడుతూ.. కొన్ని కామెంట్స్ చేశారు లతా మంగేష్కర్. రెహ్మాన్ కి చాలా సిగ్గు అని.. ఇంట్రావర్ట్ పెర్సన్ అని అన్నారు. తన టాలెంట్, హార్డ్ వర్క్ చూస్తుంటే ముచ్చటేస్తుందని.. రెహ్మాన్ విషయంలో చాలా గర్వంగా ఫీల్ అవుతానని అన్నారు.
View this post on Instagram
View this post on Instagram
May she rest in peace & light up the heavens with her soulful voice.. pic.twitter.com/yz2AJVevhq
— Ilaiyaraaja (@ilaiyaraaja) February 6, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)