అన్వేషించండి

Mukku Avinash: ముక్కు అవినాష్‌ పెళ్లి కబురు.. నిశ్చితార్థం ఫొటోలు వైరల్, అమ్మాయి ఎవరంటే..

ముక్కు అవినాష్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి.

‘జబర్దస్త్’ కామెడీ షోతో పరిచయమై.. ‘బిగ్‌ బాస్’ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు ‘కామెడీ స్టార్స్’ ద్వారా ఆకట్టుకుంటున్న ముక్కు అవినాష్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ‘‘పెళ్లి ఎప్పుడు..’’ అంటూ ఎప్పుడూ ప్రశ్నల వర్షం కురిపించే అభిమానులకు సమాధానం ఇస్తూ.. అవినాష్ మంగళవారం రాత్రి తన ఎంగేజ్మెంట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు.  

‘‘సరైన వ్యక్తి జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ఆలస్యం చేయక్కర్లేదు. మా కుటుంబాలు కలిశాయి. మేము కూడా కలిశాం. ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. మీరు నన్ను చాలాసార్లు ‘పెళ్లి ఎప్పుడు’ అని అడిగారు. అతి త్వరలో నా అనుజాతో. ఎప్పటిలాగానే మీ ఆశీర్వాదాలు ఉంటాయని కోరుకుంటూ.. మీ ముక్కు అవినాష్. సారీ.. మీ అనుజ అవినాష్’’ అని పేర్కొన్నాడు. మొత్తానికి అవినాష్ పెళ్లి కబురు చెప్పడంతో అరియానాతో లవ్ ట్రాక్‌పై అభిమానులకు స్పష్టత వచ్చేసింది. 

అవినాష్‌ను పెళ్లాడుతున్న అమ్మాయి పూర్తి పేరు అనూజ వాకిటి అని తెలిసింది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లని సమాచారం. అయితే, పెళ్లి ఎప్పుడు అనేది అవినాష్ ఇంకా వెల్లడించలేదు. అవినాష్ ప్రస్తుతం మా టీవీలో ప్రసారమవుతున్న ‘కామెడీ స్టార్స్’ షో ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ‘బిగ్‌బాస్’ తెలుగు సీజన్ 4లో అవకాశం లభించడంతో అవినాష్ ‘జబర్దస్త్’ షోను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ రీ-ఎంట్రీకి అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రముఖ యాంకర్, నిర్మాత ఓంకార్.. ‘కామెడీ స్టార్స్’లో అవినాష్‌కు అవకాశం కల్పించారు. 

‘బిగ్‌ బాస్’ హౌస్‌లో అవినాష్‌కు అరియానాతో స్నేహం కుదిరింది. అయితే, వారిది కేవలం స్నేహమా? ప్రేమా అనేది క్లారిటీ ఇవ్వలేదు. కామెడీ స్టార్స్‌తో కూడా ఆమెతో జంటగా కనిపిస్తూ.. ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. కొన్ని స్పర్థల వల్ల మధ్యలో కొన్ని రోజులు అవినాష్.. అరియానాకు దూరంగా ఉన్నాడు. ఇటీవలే మళ్లీ ఆమెకు తన స్కిట్‌లో రీ-ఎంట్రీ ఇచ్చి.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూను ట్రోల్ చేశాడు. ఈ సందర్భంగా అవినాష్.. తనకు అరియానాకు మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని, ఇంకేమీ లేదని స్పష్టం చేశాడు. తాజాగా అనుజాతో పెళ్లి కుదిరిన నేపథ్యంలో సందేహాలకు తెరపడినట్లే. 

Also Read: తెలుగులో ‘మనీ హీస్ట్’ పార్ట్-5: ప్రొఫెసర్ చనిపోతారా? తెరపైకి టోక్యో ఫ్లాష్‌బ్యాక్!
Also Read: ‘మణికే మాగే హితే’.. ఈ వైరల్ సాంగ్ పాడిన యొహానీ ఎవరో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Aishwarya Varma: ఎదిరించి ఇండస్ట్రీలోకి.. భర్త ఫుల్ సపోర్ట్.. చామంతి సీరియల్ నటి ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ విషయాలు
ఎదిరించి ఇండస్ట్రీలోకి.. భర్త ఫుల్ సపోర్ట్.. చామంతి సీరియల్ నటి ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ విషయాలు
Vadhandhi Season 2 OTT : అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
NTR Dragon Update : ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో బాలీవుడ్ స్టార్? - యాక్షన్ సీక్వెన్స్‌పై క్రేజీ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో బాలీవుడ్ స్టార్? - యాక్షన్ సీక్వెన్స్‌పై క్రేజీ అప్డేట్ ఏంటంటే?
Chinna Chinna Aasai OTT : అనుకోని పరిచయం... కలల ప్రయాణం - ఓటీటీలోకి క్యూట్ ఎమోషనల్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
అనుకోని పరిచయం... కలల ప్రయాణం - ఓటీటీలోకి క్యూట్ ఎమోషనల్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
Embed widget