Mouni Roy-Suraj Nambiar Wedding: ఓ ఇంటి కోడలైన 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్... పెళ్లి ఎలా జరిగిందో చూడండి
'నాగిని' సీరియల్ ఫేమ్ మౌనీ రాయ్ ఓ ఇంటి కోడలు అయ్యారు. ఈ రోజు ఉదయం గోవాలో సూరజ్ నంబియార్‌తో ఆమె ఏడడుగులు వేశారు. పెళ్లి ఎలా జరిగిందో చూడండి
'నాగిని' సీరియల్ ఫేమ్, బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ఓ ఇంటి కోడలు అయ్యారు. ఈ రోజు (గురువారం, జనవరి 27 - 2022) గోవాలో సూరజ్ నంబియార్‌తో ఆమె ఏడు అడుగులు వేశారు. వీరిద్దరి పెళ్లి గురించి కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే... ఆమె ఎప్పుడూ పెదవి విప్పింది లేదు. పెళ్లికి కొన్ని గంటల ముందు... సూరజ్ నంబియార్‌తో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి 'ఓం నమః శివాయ' అని ఆమె కాప్షన్ ఇచ్చారు.
సూరజ్ నంబియార్, మౌనీ రాయ్ వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. తెల్లటి చీరలో మౌనీ ధగధగ మెరిసిపోయారు. సూరజ్ నంబియార్ దుబాయ్‌లో సెటిల్ అయిన వ్యాపారవేత్త అయినప్పటికీ... ఆయన సౌత్ ఇండియన్, కేరళ హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఆమె మెడలో సూరజ్ మూడు ముళ్లు వేశారు. ఈ జంటకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. మందిరా బేడీ సహా పలువురు ప్రముఖులు గోవాలో పెళ్లికి హాజరు అయ్యారు.
View this post on Instagram
View this post on Instagram
#Watch: #MouniRoy ties the knot with #SurajNambiar in #MalayaliWeddingCeremony #MouniRoywedding #mounikishaadi #WeddingCeremony #Entertainment #EntertainmentNews pic.twitter.com/8yBGpIluGi
— Free Press Journal (@fpjindia) January 27, 2022