MohanBabu: దేశభక్తి ఆయన రక్తంలోనే ఉంది... మోహన్‌బాబు సినిమా కూడా ఫిబ్రవరిలోనే విడుదల
ఫిబ్రవరిలో సినిమాల జాతరే జరగబోతోంది. ఇప్పుడు మరో సినిమా ఫిబ్రవరిలో విడుదలవ్వడానికి సిద్దమైంది.
చాలా రోజుల తరువాత మోహన్ బాబు నటించిన సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’. ఇందులో మోహన్ బాబు దేశభక్తి కల వ్యక్తిగా కనిపించన్నారు. ఇది మంచువారి సొంత సినిమా అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నది మంచు విష్ణు. మ్యూజిక్ మాంత్రికుడు ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. గతంలో మోహన్ బాబు నటించిన ఎన్నో సినిమాలకు ఇళయరాజా మ్యూజిక్ డైరెక్ట్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో సూపర్ హిట్ పాటలు కూడా ఉన్నాయి. కాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్రనిర్మాతలు. ఫిబ్రవరి 18న ఈ సినిమా విడుదల కానుంది. అసలే మోహన్ బాబు తెరపై కనిపించి ఏడేళ్లకు పైగా గడిచింది. దీంతో అతడిని చూడడం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూడడం ఖాయం.
ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్ గతంలోనే విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘దేశభక్తి అతని రక్తంలోనే ఉంది’ అని క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది రత్నబాబు. ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తున్నారు.
మోహన్ బాబు 1969లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ కెమెరా వెనుక ఉండి అనేక పాత్రలు పోషించారు. తొలిసారి నటుడిగా మేకప్ వేసుకుంది మాత్రం 1974లో. కన్నవారి కలలలు, అల్లూరి సీతారామరాజు సినిమాల్లో ఆ ఏడాదిలోనే కనిపించారు. 1978లో ఆయన ప్రధానపాత్రలో చేసిన శివరంజని సినిమా సూపర్ హిట్ కొట్టడంతో అప్పట్నించి వరుస పెట్టి సినిమా అవకాశాలు వచ్చాయి. ఇప్పటివరకు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.
Patriotism in his blood #SonofIndia🇮🇳
— Mohan Babu M (@themohanbabu) February 2, 2022
Grand Release in Theaters on 18th February⚡️
🎶Maestro #Ilaiyaraaja Musical🎵on @adityamusic
Proudly produced by @iVishnuManchu & Directed by @ratnababuwriter@24framesfactory #SreeLakshmiPrasannaPictures #SOI🇮🇳 #SonofIndiaFromFeb18th 🔥 pic.twitter.com/MaVukQlWVo
Thank you 🙏❤️. https://t.co/XCo4Jha2CR @KChiruTweets @Suriya_offl @iVishnuManchu #SonofIndia pic.twitter.com/LBD1A8szzw
— Mohan Babu M (@themohanbabu) June 4, 2021