News
News
X

Mister And Misses Show: ఇలాంటి వారిని నా పక్కన పెట్టొద్దు, అనిల్ రావిపూడిపై స్నేహా కామెంట్!

యాంకర్ శ్రీముఖి సరికొత్త షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతుంది. ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌' అనే రియాలిటీ షోకు ఈ బొద్దుగుమ్మ హోస్ట్‌ గా వ్యవహరించనుంది. అందాల తార స్నేహ జడ్జిగా వస్తుంది.

FOLLOW US: 
 
తెలుగు బుల్లి తెరపై మరో అదిరిపోయే షో అలరించబోతుంది. జ్ఞాపిక ప్రొడక్షన్స్ సారథ్యంలో 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌' అనే రియాలిటీ షో రాబోతుంది. అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి ఈ షోకు హోస్టుగా చేస్తున్నది. డైరెక్టర్ అనిల్ కడియాల ఈ షోకు దర్శకత్వం వహిస్తున్నారు. పది సెలబ్రిటీ జంటలతో ఈ షోను ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ షోకు  ప్రముఖ నటి స్నేహ, ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి, నటుడు శివబాలాజీ జడ్జిలుగా వ్యవహరించనున్నారు. ఈ ఫోలో పాల్గొనే 10 జంటలకు పలు రకాల టాస్క్ లు ఉంటాయి. వాటిలో విజయం సాధించిన వారు ఫైనల్ కు వెళ్తారు. గ్రాండ్ ఫినాలేకు వెళ్తారు. అక్కడ విజయం సాధించిన వారు  షో టైటిల్ తో పాటు పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం ఉంటుంది.

స్నేహ, శివబాలాజీ, అనిల్ రావిపూడి గ్రాండ్ ఎంట్రీ

ఈ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయ్యింది. అదిరిపోయే సెట్ లో, కళ్లు మిరుమిట్లుగొలిపే విద్యుత్ కాంతుల్లో, అందమైన సెలబ్రిటీ జంటలతో, ముగ్గురు జడ్జీల సమక్షంలో షో దుమ్మురేపనుంది. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ షోలో రవి కిరణ్‌–సుష్మా, పవన్‌–అంజలి, సందీప్‌–జ్యోతి, హ్రితేష్‌–ప్రియా, శ్రీవాణి–విక్రమ్‌, మధు–ప్రియాంక, ప్రీతమ్‌–మానస, సిద్దు–విష్ణుప్రియ, రాకేశ్‌–సుజాత, విశ్వ–శ్రద్ధ జంటలు పాల్గొన్నాయి. వీరి కలర్ ఫుల్ ఎంట్రీతో షోకు గ్రాండ్ లుక్ వచ్చింది. స్నేహ ముద్దుముద్దు మాటలు, అనిల్ రావిపూడి, శివ బాలాజీ అల్లరి హైలెట్ గా నిలిచాయి.

శ్రీముఖి కితకితలు, జడ్జిల కామెడీ  

ప్రోమో ప్రారంభం కాగానే, జడ్జిగా స్నేహ ఎంట్రీ ఇచ్చింది. రాగానే మిస్టర్ ప్రసన్న గారు ఎక్కడున్నారు? అని శ్రీముఖి అడుగుతుంది. హృదయంలో ఉన్నారని చెప్తుంది. స్నేహ హృదయాన్ని చూస్తూ.. హలో ప్రసన్న గారూ ఎలా ఉన్నారు? అని అడుగుతుంది శ్రీముఖి. స్నేహ నవ్వుల్లో మునిగిపోతుంది. ఆ తర్వాత తార్ మార్ పాటతో  శివ బాలాజీ ఎంట్రీ ఇస్తాడు. మీ భార్య భర్తల్లో ఎవరిది అప్పర్ హ్యాండ్ అని శ్రీముఖి అడగ్గా, ఒకరు పైన, మరొకరు కిందని కాదు, ఇద్దరం సమానం అని చెప్తాడు. అనంతరం అనిల్ రావిపూడి సెట్ లోకి అడుగు పెడతాడు. లవ్ లవ్ లెటర్ లో ఎలాంటి పాయింట్స్ రాస్తే అమ్మాయిలు ఓకే చెప్తారు? అని శ్రీముఖి అడుగుతుంది. నీలాంటి అమ్మాయి అయితే ఆస్తి మొత్తం రాసిస్తానంటే ఒప్పుకుంటుందని అనిల్ సమాధానం ఇస్తాడు.   మరి అబ్బాయిలకు అని అడుగుతుంది. అబ్బాయిలు చాలా సున్నిత మనస్కులు జస్ట్ మనసు ఇస్తే సరిపోతుంది అంటాడు.  అదొక్కటే చాలా? అంటుంది. బోలెడు లగేజీ ఉందిగా, స్ట్రెస్, ఫ్రస్టేషన్, ఈగో, అరవటాలు, తిట్టడాలు, ఓదార్పు యాత్రలు చాలా ఉన్నాయి అంటాడు. ఆ తర్వాత కంటెస్టెంట్లు వస్తున్నప్పుడు అనిల్ చేసే కామెంట్స్ అందరినీ నవ్వించాయి. ఈ సమయంలోనే స్నేహ.. భవిష్యత్ లో ఇలాంటి వ్యక్తిని పక్కన పెట్టొద్దు అని చెప్తుంది. మీరు మాత్రం ఆయన పక్కనే కూర్చున్నారేంటి? అని శ్రీముఖి ప్రశ్నించడంతో సెట్ అంతా నవ్వుల పువ్వులు పూస్తాయి. ఆ తర్వాత సెలబ్రిటీ జంటలు చేసే సందడి మామూలుగా ఉండదు. ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌’ షో ఈటీవీలో ఈ రోజు ( అక్టోబర్‌ 11) నుంచే   ప్రారంభం అవుతుంది. ప్రతి మంగళవారం రాత్రి 9:30 నిమిషాలకు ప్రసారం అవుతుంది.

News Reels

Published at : 11 Oct 2022 02:38 PM (IST) Tags: Srimukhi Anil Ravipudi Sneha Shiva Balaji Mister & Misses Show

సంబంధిత కథనాలు

Rakul Preet Singh: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!

Rakul Preet Singh: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Priyanak Jain- Amardeep: షూటింగ్ సెట్‌లో అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య పెద్ద గొడవ - షాకైన ‘జానకి కలగనలేదు’ టీమ్

Priyanak Jain- Amardeep: షూటింగ్ సెట్‌లో అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య పెద్ద గొడవ - షాకైన ‘జానకి కలగనలేదు’ టీమ్

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

Bigg Boss 6 Telugu: ఇంట్లో అతనే అన్‌డిజర్వ్ అంటున్న శ్రీహాన్, కాదు అతనే విన్నర్ మెటీరియల్ అంటున్న ప్రేక్షకులు

Bigg Boss 6 Telugu: ఇంట్లో అతనే అన్‌డిజర్వ్ అంటున్న శ్రీహాన్, కాదు అతనే విన్నర్ మెటీరియల్ అంటున్న ప్రేక్షకులు

టాప్ స్టోరీస్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం  - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!