By: ABP Desam | Updated at : 14 Oct 2021 11:54 AM (IST)
మంచి రోజులు వచ్చాయి పోస్టర్
‘ఏక్ మినీ కథ’ సినిమా తరువాత సంతోష్ శోభన్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇక ‘ప్రతి రోజు పండగే’ సినిమా తరువాత మారుతి దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘మంచి రోజులు వచ్చాయి’. ఇందులో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నారు. మెహ్రీన్ కథానాయిక. మారుతి ఈ సినిమాను తన ప్రత్యేక మార్కుతో రూపొందించారు. ఇందులో లవ్ ట్రాక్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. గతంలోనే ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేశారు. తాజాగా గురువారం చిత్రయూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ ను బట్టి సినిమా ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడం ఖాయంలా కనిపిస్తోంది.
దసరా ముందురోజు విడుదలైన ఈ ట్రైలర్లో 1.49 నిమిషాల పాటూ సాగింది. ఇందులో హీరోహీరోయిన్ల ప్రేమను, కామెడీని, హీరోయిన్ తండ్రి ఫ్రస్టేషన్ ను, కుటుంబసన్నివేశాలను చక్కగా చూపించారు. తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధంతో ఈ సినిమా తీస్తున్నట్టు అర్థమవుతోంది. తన కూతురి జీవితంలోకి వచ్చిన ఓ అబ్బాయిని తండ్రి దూరం చేయాలనుకుంటాడు. ఆ ప్రక్రియను కూడా కామెడీగా చూపించారు సినిమాలో. అలాగే తండ్రి చుట్టు ఉన్న స్నేహితులు అతడిని రెచ్చగొట్టి కూతురి ప్రేమికుడి మీదకు ఉసిగొల్పడం లాంటి సీన్లు కామెడీగా ఉన్నాయి. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను వచ్చే నెల 4వ తేదీన విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది.
ఈ చిత్రంలో సహోద్యోగి సంతోష్‌తో ప్రేమలో పడే అమ్మాయిగా కనిపించబోతోంది మెహ్రీన్. సంతోష్ అంటే ఆనందానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకుంటారంతా. ఇక అతి భయంతో, కూతురే ప్రాణంగా బతికే తండ్రిగా కనిపించబోతున్నాడు అజయ్ ఘోష్. ఎక్కువగా విలన్ పాత్రలు పోషించే అజయ్ ఘోష్ తొలిసారి కామెడీ తండ్రి పాత్ర పోషించాడు. కూతురి విషయంలో అతి భయాన్ని ప్రదర్శించడం అతడి లోపంగా ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఈ సినిమాలో వైవా హర్ష, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్... ఇలా అనేక మంది కామెడీ స్టార్లు కనిపిస్తున్నారు.
Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్
Godse Movie Release Date: సత్యదేవ్ 'గాడ్సే' రిలీజ్ డేట్ మారింది!
Major Movie: 'మేజర్' నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ - విన్నారా?
Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు
Anil Ravipudi: ఎన్టీఆర్ తో సినిమా - అనిల్ రావిపూడి ఏమన్నారంటే?
Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత
LSG vs KKR: తొలి వికెట్కు 210*! ఐపీఎల్ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్, డికాక్
IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి
Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్ - ఓ రేంజ్లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు