Sudheer Babu Latest Look: సుధీర్ బాబు మరో ప్రయోగం - ‘దుర్గ’గా బరువైన పాత్ర
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా మూవీ ‘మామా మశ్చీంద్ర’. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ వచ్చేసింది. సిక్స్ ప్యాక్ లో కనిపించే సుధీర్ బాబు ఇందులో బరువైన వ్యక్తిగా కనిపించాడు.
హీరో సుధీర్ బాబు నటిస్తున్న ‘మామా మశ్చీంద్ర’ నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. గతంలో ఎప్పుడూ కనిపించని రీతిలో ఆయన షాకింగ్ లుక్ రిలీవ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్, గ్లింప్స్ లో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ బాడీతో కనపడగా, ఫస్ట్ లుక్ తో పూర్తి భిన్నంగా కనిపించాడు. ఈ చిత్రంలో సుధీర్ బాబు 3 పాత్రల్లో నటిస్తున్నారు. వాటిలో ఒకటి దుర్గ కాగా, మరొకటి పరశురామ్, ఇంకోటి డీజే. తాజాగా దుర్గ లుక్ ను రివీల్ చేశారు.
The WAIT (Weight) is OVER😊
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) March 1, 2023
'దుర్గ' అనే బరువైన పాత్రలో మీ దిల్ దోచేయడానికి వస్తున్నాడు! ❤️
Introducing,@isudheerbabu as #DURGA from #MaamaMascheendra 💥@HARSHAzoomout @chaitanmusic @pgvinda @AsianSuniel @puskurrammohan @SVCLLP #SrishtiCelluloids pic.twitter.com/yqah9QAgPd
‘మామా మశ్చీంద్ర’ నుంచి సుధీర్ బాబు ఫస్ట్ లుక్ విడుదల
పొడవాటి జుట్టు, లేత గడ్డంతో సుధీర్ బాబు బరువైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఈపాత్రలో ఆయన ఊభకాయంతో బాధపడుతున్న వ్యక్తిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కారు బానెట్‌పై కూర్చున్న సుధీర్ బాబు తేడా చూపుతో కన్నింగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. మెడకు బంగారు గొలుసు, ఇతర ఆభరణాలను కూడా ధరించాడు. సుధీర్ బాబు గతంలో ఎప్పుడూ లేని ఆశ్చర్యకరమైన మేక్ ఓవర్ లో కనిపిస్తున్నాడు. వాస్తవానికి సుధీర్ బాబు విభిన్నమైన పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తాడు. ప్రస్తుతం అలాంటి విలక్షణ పాత్రలే ఈ సినిమాలో పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలోని పరశురామ్ లుక్‌ని 4న, డీజే లుక్‌ని ఈ నెల 7న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా సుధీర్ బాబు దుర్గ క్యారెక్టర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. అందులో కనిపించినట్లుగా ఫస్ట్ లుక్ లో కనిపిస్తున్నాడు.
Get ready to Mesmerize with 3 Striking Looks of our NITRO 🌟 @isudheerbabu from #MaamaMascheendra 🤘🏻🤩
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) February 28, 2023
March 1st - DURGA Look
March 4th - PARASURAM Look
March 7th - DJ Look@HARSHAzoomout @chaitanmusic @pgvinda #SunielNarang @puskurrammohan @SVCLLP #SrishtiCelluloids pic.twitter.com/EUk06VUrTK
ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ‘మామా మశ్చీంద్ర’
ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. నటుడు హర్ష వర్ధన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సుధీర్ బాబు సరసన తమిళ హీరోయిన్ మృణాళిని రవి నటిస్తోంది. తెలుగు, హిందీలో ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. సృష్టి సెల్యులాయిడ్ సోనాలి నారంగ్, సృష్టి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సంగీత దర్శకుడిగా చైతన్ భరద్వాజ్ పని చేస్తున్నారు.
కొంతకాలంగా బాక్సాఫీస్ దగ్గర రాణించలేకపోతున్న సుధీర్ బాబు
@isudheerbabu bava Look New Movie #MaamaMascheendra#SudheerBabu 👌❤️ pic.twitter.com/6YGcOsHn19
— SANDEEPDHFM 22yrs of fanism❤️❤️ (@SANDEEPDHFM4) February 27, 2023
ఇక సుధీర్ బాబు ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రాణించలేకపోతున్నాడు. అతడి గత చిత్రాలైన ‘వేట’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ‘మామా మశ్చీంద్ర’ సినిమాతో మంచి హిట్ అందుకోవాలని భావిస్తున్న ఆయన సరికొత్త ప్రయోగానికి సిద్ధం అవుతున్నాడు.
Read Also: పిలకతో ఉన్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టగలరా?