Malvika Mohanan : ప్రభాస్ సినిమాలో భారీ ఫైట్, విలన్లను ఉతికి ఆరేస్తున్న హీరోయిన్ - అరెరే వీడియో లీక్ అయ్యిందే!
మారుతి డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్నది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఫైట్ సీన్ లీక్ అయ్యింది. ఇందులో విలన్లను హీరోయిన్ కొడుతూ కనిపించింది.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇదొక హారర్ కామెడీ థ్రిల్లర్. ఈ చిత్రానికి ‘రాజు డీలక్స్‘ సహా పలు టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఓ వైపు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తూనే... మారుతి సినిమా షూటింగ్ లోనూ ప్రభాస్ పాల్గొంటున్నట్లు సమాచారం. ఇదీ పాన్ ఇండియా సినిమాయే.
హీరోయిన్ ఫైట్ సీన్ లీక్
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తున్నది. ప్రభాస్ ఇందులో డ్యుయెల్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో ఆయన వృద్ధుడి పాత్రలో కనిపిస్తారట. ఆ పాత్రలో ఆయన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారని తెలుస్తోంది. ఇక కామెడీ, హారర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఫైట్ సీన్ లీక్ అయ్యింది. హీరోయిన్ మాళవిక విలన్లను చితకబాదుతూ కనిపించింది. కూరగాయల మార్కెట్లో ఈ ఫైట్ ను చిత్రీకరిస్తున్నట్లు అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
From the Sets of #prabhas #Maruthi Film. Heroine ke ee level fights unnayi ante, Hero ki oohinchukuntene 🥵💥#MalavikaMohanan pic.twitter.com/ouBe6sqTQj
— 🅺🅰🅸🅻🅰🆂🅷 (@KailashPrabhas_) September 15, 2023
షూటింగ్ లో పాల్గొంటున్న ప్రభాస్!
ప్రభాస్ మారుతి సినిమా ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. మిగతా పార్ట్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని హీరో, దర్శకుడు భావిస్తున్నారట. ఈ సినిమా విషయంలో ప్రభాస్ కూడా మారుతికి బాగా సహకరిస్తున్నారట. అనుకున్నట్లుగానే షూటింగ్ లో పాల్గొంటున్నారట. ఈ సినిమా కచ్చితంగా మంచి హిట్ అందుకుంటుందని ఆయన భావిస్తున్నారట.ఈ సినిమా టైటిల్ పై మాత్రం చిత్ర యూనిట్ సస్పెన్స్ ను అలానే కంటిన్యూ చేస్తోంది. ఇప్పటి వరకు టైటిల్, షూటింగ్, క్యాస్టింగ్‌కు సంబంధించి ఎలాంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది.
పాన్ ఇండియన్ సినిమాలతో ప్రభాస్ బిజీ
అటు ప్రభాస్ ప్రస్తుతం రెండు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ' సినిమా చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాగా ‘కల్కి 2898 ఏడీ’ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రీకరణ దాదాపు పూర్తి అయ్యింది. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో 'సలార్' సినిమా రూపొందుతోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా నిర్మితమవుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also: 300 కోట్లు కాదు, అంత కంటే ఎక్కువే - ‘జవాన్‘ బడ్జెట్ ఎంతో రివీల్ చేసిన అట్లీ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial