SSMB28 Launch: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మహేష్ - త్రివిక్రమ్ హ్యాట్రిక్ సినిమా...
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న తాజా సినిమా నేడు (గురువారం, ఫిబ్రవరి 3న) పూజా కార్యక్రమాలతో ప్రారంభం (SSMB 28 Launch) అయ్యింది. సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థలో ఏడో చిత్రమిది.
రామానాయుడు స్టూడియోలో జరిగిన ప్రారంభోత్సవంలో చిత్ర కథానాయిక పూజ హెగ్డే పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచ్ఛాన్ చేయగా... మహేష్ బాబు సతీమణి శ్రీమతి నమ్రత శిరోద్కర్ క్లాప్ (SSMB28 First Clap) ఇచ్చారు. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు నిర్మాత చినబాబు తెలిపారు.
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా కనిపించనున్నారు. గతంలో వాళ్లిద్దరూ 'మహర్షి' సినిమాలో జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇది రెండో సినిమా అన్నమాట.
'అతడు', 'ఖలేజా' తర్వాత మహేష్ - త్రివిక్రమ్ కలయికలో ఇది మూడో సినిమా అనేది తెలిసిన విషయమే. సుమారు పన్నెండేళ్ల విరామం తర్వాత వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న చిత్రమిది. వాళ్ళిద్దరి కాంబినేషన్ మాత్రమే కాదు... త్రివిక్రమ్ & హారిక అండ్ హాసిని - పూజా హెగ్డే, త్రివిక్రమ్ & హారిక అండ్ హాసిని - తమన్ కాంబినేషన్ లో కూడా హ్యాట్రిక్ చిత్రమిది. త్రివిక్రమ్ దర్శకత్వంలో, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో 'అరవింద సమేత వీరరాఘవ', 'అల వైకుంఠపురములో' చేశారు పూజా హెగ్డే. ఆ రెండు చిత్రాలకూ సంగీతం అందించిన తమన్, ఈ సినిమాకూ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శ్రీమతి మమత
A new chapter unfolds! #Trivikram @hegdepooja @MusicThaman @vamsi84 @haarikahassine pic.twitter.com/SrfnrwIUqv
— Mahesh Babu (@urstrulyMahesh) February 3, 2022
View this post on Instagram