అన్వేషించండి

Mahesh Babu New Movie : జనవరి నుంచి నాన్ స్టాప్‌గా - మహేష్ ఫ్యాన్స్ ఇది విన్నారా?

SSMB 28 Update : సూపర్ స్టార్ మహేష్ బాబు, గురూజీ త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ.

ఎప్పుడు? మళ్ళీ మహేష్ బాబు సెట్స్‌కు వచ్చేది ఎప్పుడు? ఆయనపై త్రివిక్రమ్ సీన్స్ తీసేది ఎప్పుడు? ఈ ప్రశ్నలకు తెర పడినట్టే. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కలయికలో ప్రతిష్టాత్మకంగా సినిమా నిర్మిస్తున్న చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సమాధానాలు ఇచ్చింది.

జనవరి నుంచి నాన్ స్టాప్‌గా!
జనవరి నుంచి SSMB 28 సెట్స్ మీదకు వెళుతుందని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ పేర్కొంది. నాన్ స్టాప్‌గా షూటింగ్ చేస్తామని తెలియజేసింది. చిత్రీకరణకు అంతా సిద్ధమైందని, హుషారుగా సెట్స్‌లో అడుగు పెడతామని పేర్కొంది. త్వరలో మరిన్ని అప్‌డేట్స్ ఇవ్వనున్నట్లు యూనిట్ సభ్యులు చెప్పారు. ఈ సందర్భంగా మహేష్ బాబుతో దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్ దిగిన ఫోటోలు షేర్ చేశారు.

క్రిస్మస్‌కు ముందు అనుకున్నా...
తొలుత క్రిస్మస్‌కు ముందు ఓ చిన్న షెడ్యూల్ చేయాలని ప్లాన్ చేశారు. ఐదారు రోజులు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ, మహేష్‌తో లేటెస్ట్ మీటింగ్ తర్వాత మొత్తం ప్లాన్ మారింది. స్మాల్ షెడ్యూల్ క్యాన్సిల్ చేసి, నాన్ స్టాప్ షూట్ చేయాలని డిసైడ్ అయ్యారు.
 
ఈసారి చలో లండన్... 
క్రిస్మస్, న్యూ ఇయర్!
Mahesh Babu New Year Plans : డిసెంబర్ మూడో వారంలో ఫ్యామిలీతో కలిసి మహేష్ బాబు లండన్ టూర్ ప్లాన్ చేశారని తెలిసింది. బహుశా... 22 లేదంటే ఆ తర్వాత రోజు అందరూ విదేశాలకు ప్రయాణం అవుతారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సమయాల్లో అక్కడే ఉంటారు. 

Also Read : నటి వీణా కపూర్ దారుణ హత్య - తల్లిని చంపి నదిలో పడేసిన కుమారుడు

మహేష్ బాబు ఫ్యామిలీకి ఈ ఏడాది కోలుకోలేని దుఃఖం ఎదురైంది. రమేష్ బాబు, ఇందిరా దేవి, కృష్ణ మరణాలు అందరినీ బాధించాయి. ఆ బాధ నుంచి కోలుకుని ఇటీవల మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేశారు మహేష్. మౌంటెన్ డ్యూ కోసం ఒక యాడ్ షూట్ చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా స్క్రిప్ట్ డిస్కషన్స్‌లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు పిల్లల కోసం ఫారిన్ టూర్ ప్లాన్ చేశారని తెలిసింది.  

మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతులతో పాటు SSMB 28 దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు తమన్ ఆ మధ్య ముంబైలో స్క్రిప్ట్, మ్యూజిక్ విషయమై డిస్కస్ చేశారు. కథ విషయంలో హీరో, దర్శకుడు మధ్య ఏకాభిప్రాయం కుదరపోవడం కారణంగా షూటింగ్ ఆగిందని వచ్చిన వార్తల్లో నిజం లేదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఆ వార్తలు నిజం కాదని తెలిపాయి. మహేష్ తండ్రి కృష్ణ, కొన్ని రోజుల క్రితం తల్లి ఇందిరా దేవి మరణాల కారణంగా చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది.

ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 12th:రాధను బయటకు తీసుకెళ్లి విక్కీ ఏం చేశాడు...రాధపై మరోమారు హత్యాయత్నం ఎలా జరిగింది..?
నువ్వులేక నేను లేను:రాధను బయటకు తీసుకెళ్లి విక్కీ ఏం చేశాడు...రాధపై మరోమారు హత్యాయత్నం ఎలా జరిగింది..?
Karthika Deepam 2 Serial Today August 12th: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌ వస్తువులు తిరిగి ఇచ్చేసిన జ్యోత్స్న! సూరజ్‌కి జ్యోత్స్నలో మార్పు అర్థమవుతుందా!
కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌ వస్తువులు తిరిగి ఇచ్చేసిన జ్యోత్స్న! సూరజ్‌కి జ్యోత్స్నలో మార్పు అర్థమవుతుందా!
Brahmamudi Serial Today August 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్: శశి లోకేషన్‌ తెలుసుకున్న నందు – ఐషుకు నిజం చెప్పిన రేణు  
‘బ్రహ్మముడి’ సీరియల్: శశి లోకేషన్‌ తెలుసుకున్న నందు – ఐషుకు నిజం చెప్పిన రేణు  
Gundeninda Gudigantalu August 12th:రోహిణి విషయం ముందే తెలుసని తప్పు తనపై వేసుకున్న మనోజ్‌...కొడుకుపై చేయిచేసుకున్న ప్రభావతి
గుండెనిండా గుడిగంటలు:రోహిణి విషయం ముందే తెలుసని తప్పు తనపై వేసుకున్న మనోజ్‌...కొడుకుపై చేయిచేసుకున్న ప్రభావతి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget