Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' ఫస్ట్ సింగిల్, 'కళావతి' సాంగ్ ప్రోమో చూశారా?
మహేష్ బాబు, కీర్తీ సురేష్ జంటగా నటిస్తున్న సినిమా 'సర్కారు వారి పాట'. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫస్ట్ సాంగ్ విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Sarkaru Vaari Paata | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో 'సర్కారు వారి పాట' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ 'ఆర్ఆర్ఆర్' కోసం ఈ సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ఫైనల్ గా సమ్మర్ కనుకగా మే 12న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సినిమాలో తొలి పాట 'కళావతి...' విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను వదిలారు. తాజాగా సాంగ్ ప్రోమో బయటకొచ్చింది. 36 సెకన్ల ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు.
మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేయనున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అందులో పూజా హెగ్డే కథానాయిక.
#Kalaavathi... a glimpse :)@MusicThaman looking forward to the album!https://t.co/bxMrT0JM0h@KeerthyOfficial @ParasuramPetla @sidsriram @MythriOfficial @GMBents @14ReelsPlus #SarkaruVaariPaata
— Mahesh Babu (@urstrulyMahesh) February 11, 2022
View this post on Instagram