Namrata Shirodkar: సితార లిమిట్స్ క్రాస్ చేయదు - నమ్రత ఓపెన్ కామెంట్స్
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే సితార భారీ ఇమేజ్ ను సంపాదించుకుంది.

మహేష్ బాబు గారాల కూతురు సితార చిన్నవయసులోనే భారీ పాపులారిటీ దక్కించుకుంది. మహేష్ కొడుకు గౌతమ్ చాలా సైలెంట్ గా ఉంటాడు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించడు. కానీ సితార మాత్రం అలా కాదు.. చాలా యాక్టివ్ గా ఉంటుంది. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టి పలు వీడియోలను షేర్ చేస్తుంటుంది. అలానే ఇన్స్టాగ్రామ్ లో కూడా తనకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తుంటుంది.
అంతేకాదు.. తన తండ్రి సినిమాలను కూడా ప్రమోట్ చేస్తుంటుంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే ఈ స్టార్ కిడ్ భారీ ఇమేజ్ ను సంపాదించుకుంది. తన తండ్రి మహేష్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' సినిమాలో పెన్నీ అనే సాంగ్ ప్రోమోలో కనిపించింది సితార. తన స్టెప్స్ తో అలరించింది. మరి సినిమాలో కూడా సితార కనిపిస్తుందేమో చూడాలి. ఇదిలా ఉండగా.. తాజాగా నమ్రత తన కూతురు సితార గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
సితార విషయంలో తనకు మహేష్ బాబుకి ఎలాంటి భయం లేదని చెప్పింది నమ్రత. తన కూతురు ఇష్టపడే పనిలోనే ప్రోత్సహిస్తూ ఆమెని ఆనంద పెడుతున్నామని చెప్పారు. సితార వయసు ఇప్పుడు తొమ్మిదేళ్లే కాబట్టి ఆమెకి ఏది మంచి..? ఏది చెడు..? ఎవరితో ఎలా ప్రవర్తించాలని విషయాలపై తాను, మహేష్ సూచనలు ఇస్తుంటామని చెప్పుకొచ్చారు. తను కూడా ఎక్కడా లిమిట్స్ క్రాస్ చేసి వ్యవహరించదని తెలిపారు. ఇంత చిన్న వయసులోనే సితారకు దక్కిన ఈ గుర్తింపు తల్లిదండ్రులుగా తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు.
Also Read: ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు, అవమానంగా అనిపించింది - మెగాస్టార్ వ్యాఖ్యలు
Also Read: చిరంజీవి గారి కంటే నా హీరోనే బెటర్ - రాజమౌళి స్పీచ్ విన్నారా?
View this post on Instagram
Before You Go
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















