అన్వేషించండి
Advertisement
Sarkaru Vaari Paata First Single: క్లాసిక్ 'కళావతి' ముందే వచ్చేసింది, మహేష్ వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇదిగో!
చెప్పిన టైం కంటే ముందుగానే 'కళావతి' సాంగ్ ను విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు.
Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో 'సర్కారు వారి పాట' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ఫైనల్ గా సమ్మర్ కానుకగా మే 12న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉండగా ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సినిమాలో తొలి పాట 'కళావతి...' విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను, సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. అయితే చిత్రబృందం విడుదల చేయకముందే 'కళావతి' సాంగ్ లీకైపోయింది. ఈ విషయంలో చిత్రయూనిట్ తో పాటు మహేష్ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు.

సంగీత దర్శకుడు తమన్ ఆవేదన చెందుతూ.. సోషల్ మీడియాలో ఓ ఆడియో బైట్ ను షేర్ చేశారు. తన హార్ట్ బ్రేక్ అయిందంటూ ఎమోషనల్ గా మాట్లాడారు. సాంగ్ లీక్ అవ్వడంతో ఇప్పుడు చెప్పిన టైం కంటే ముందుగానే 'కళావతి' సాంగ్ ను విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు.
మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేయనున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
హైదరాబాద్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement