Sarkaru Vaari Paata: మహేష్ సినిమాకి కూతురి ప్రమోషన్, 'కళావతి' పాటకి సితార స్టెప్పులు

మహేష్ బాబు కూతురు సితార కూడా 'కళావతి' పాటకు స్టెప్పులేసింది. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. #KalaavathiChallenge అంటూ అభిమానులకు ఓ ఛాలెంజ్ విసిరింది.

FOLLOW US: 
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ దశలో ఉంది. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గానే ఈ సినిమా నుంచి 'కళావతి' అనే సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. చాలా మంది ఈ పాటకు రీల్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 
 
ఇప్పుడు మహేష్ బాబు కూతురు సితార కూడా 'కళావతి' పాటకు స్టెప్పులేసింది. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. #KalaavathiChallenge అంటూ అభిమానులకు ఓ ఛాలెంజ్ విసిరింది. 'కళావతి' పాటకు రీల్స్ చేసి #KalaavathiChallenge పేరుతో వీడియోలను షేర్ చేయాలని కోరింది. అందులో తనకు నచ్చిన వీడియోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టుకుంటానని చెప్పింది. 
 
మొత్తానికి సితార తన తండ్రి సినిమాకి ఈ విధంగా ప్రమోషన్స్ మొదలుపెట్టేసిందన్నమాట. చిన్న వయసులోనే సితార తన వీడియోలు, ఫొటోలతో అభిమానులను సంపాదించుకుంది. ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో ఐదు లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
 
ఇక మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న 'సర్కారు వారి పాట'ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 12న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేయనున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
 
View this post on Instagram
 
A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni)

Published at : 20 Feb 2022 12:12 PM (IST) Tags: Mahesh Babu Sarkaru Vaari Paata Sitara Kalaavathi Song

సంబంధిత కథనాలు

70 years For Devadasu: అలనాటి క్లాసిక్ 'దేవదాసు'కు డెబ్భై ఏళ్ళు

70 years For Devadasu: అలనాటి క్లాసిక్ 'దేవదాసు'కు డెబ్భై ఏళ్ళు

Emilia Clarke: ఔను, అది నిజమే! ‘GoT’ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ‘డ్రాగన్ క్వీన్’ ఎమీలియా క్లార్క్!

Emilia Clarke: ఔను, అది నిజమే! ‘GoT’ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ‘డ్రాగన్ క్వీన్’ ఎమీలియా క్లార్క్!

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

Madhavan Gets Trolled: సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు

Madhavan Gets Trolled: సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు

Kaduva Telugu Movie Teaser: వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్ 

Kaduva Telugu Movie Teaser: వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్ 

టాప్ స్టోరీస్

India vs England 5th Test: రోహిత్‌కు కరోనా - మరి ఐదో టెస్టుకు కెప్టెన్‌ ఎవరు?

India vs England 5th Test: రోహిత్‌కు కరోనా - మరి ఐదో టెస్టుకు కెప్టెన్‌ ఎవరు?

Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?

Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?  ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?

PM Modi Mann Ki Baat: వ్యక్తిగత స్వేచ్ఛను లాగేసుకున్న రోజులవి, మన్‌కీ బాత్‌లో ఎమర్జెన్సీపై ప్రధాని ప్రస్తావన

PM Modi Mann Ki Baat: వ్యక్తిగత స్వేచ్ఛను లాగేసుకున్న రోజులవి, మన్‌కీ బాత్‌లో ఎమర్జెన్సీపై ప్రధాని ప్రస్తావన

T Hub Pics: టీ హబ్ 2.0 రెడీ, అబ్బురపరిచే నిర్మాణ శైలి! గాల్లోనే ఎక్కువ భాగం బిల్డింగ్ - ప్రారంభం ఎప్పుడంటే

T Hub Pics: టీ హబ్ 2.0 రెడీ, అబ్బురపరిచే నిర్మాణ శైలి! గాల్లోనే ఎక్కువ భాగం బిల్డింగ్ - ప్రారంభం ఎప్పుడంటే