Guntur Kaaram 4th day collection: నాలుగు రోజుల్లో 'గుంటూరు కారం' సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Karam box office collection: సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాకు నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయి? ఇంకా ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది? అనేది చూస్తే...
'గుంటూరు కారం' సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఇమేజ్ బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పాలి. థియేటర్లకు ప్రేక్షకులను తీసుకు రావడంలో ఆయన సూపర్ డూపర్ సక్సెస్ అయ్యారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'గుంటూరు కారం'. మూడు రోజుల్లో ఈ సినిమా రూ. 164 కోట్లు కలెక్ట్ చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ అనౌన్స్ చేసింది. అయితే... ట్రేడ్ వర్గాల లెక్క ప్రకారం నాలుగు రోజుల్లో ఈ సినిమా 134 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది.
నాలుగో రోజు 'గుంటూరు కారం' కలెక్షన్లు ఎంతంటే?
- నైజాం ఏరియా (తెలంగాణ) - రూ. 3.5 కోట్లు
- సీడెడ్ (రాయలసీమ) - రూ. 1.48 కోట్లు
- ఉత్తరాంధ్ర (విశాఖ) - రూ. 1.21 కోట్లు
- తూర్పు గోదావరి - రూ. 71 లక్షలు
- పశ్చిమ గోదావరి - రూ. 50 లక్షలు
- గుంటూరు - రూ. 74 లక్షలు
- కృష్ణ - రూ. 70 లక్షలు
- నెల్లూరు - రూ. 38 లక్షలు
Also Read: కంగువా కథలో ట్విస్ట్ - సెకండ్ లుక్‌తో కాన్సెప్ట్ రివీల్ చేశారుగా
Guntur Kaaram 4 Days Collection Worldwide: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజు ఈ సినిమా 9.67 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ విషయానికి వస్తే... రూ. 15.75 కోట్లు కలెక్ట్ చేసింది. టోటల్ ఫోర్ డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే... రూ.134 కోట్ల గ్రాస్ ఉంది. షేర్ విషయానికి వస్తే... రూ. 84.58 కోట్లు కలెక్ట్ చేసింది.
'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
ఏపీ, తెలంగాణ... రెండు రాష్ట్రాల్లో 'గుంటూరు కారం' టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 102 కోట్లు. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రైట్స్ కలిపి రూ. 9 కోట్లకు ఇచ్చారు. ఓవర్సీస్ రైట్స్ ద్వారా రూ. 20 కోట్లు వచ్చాయి. టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 132 కోట్లు. ఈ సినిమాకు మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ లేదు. మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. విమర్శలను దాటుకుని నాలుగు రోజుల్లో 85 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం మామూలు విషయం కాదు.
Also Read: బాక్సాఫీస్ బరిలో కింగ్ నాగార్జున జోరు - రెండు రోజుల్లో 'నా సామి రంగ'కు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
మహేష్ లాస్ట్ ఐదు సినిమాల బిజినెస్ ఎలా జరిగింది?
మహేష్ బాబు కెరీర్ మొత్తం చూస్తే... ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో 'గుంటూరు కారం' హయ్యస్ట్ రికార్డ్ నమోదు చేసింది. దీనికి ముందు 'సర్కారు వారి పాట' రూ. 120 కోట్లు, 'సరిలేరు నీకెవ్వరు' & 'మహర్షి', 'భరత్ అనే నేను' సినిమాలు రూ. 100 కోట్లు చొప్పున ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాయి. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన 'స్పైడర్' సినిమా 124 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. 'గుంటూరు కారం'తో తన సినిమాల్లో మహేష్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. సినిమా హైప్ చూస్తుంటే... ఈజీగా 150 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.