Mahesh Babu: పిల్లలతో కలసి స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న మహేశ్ బాబు
‘సర్కారు వారి పాట’షూటింగ్ కి చిన్న విరామం తీసుకున్న మహేశ్ బాబు ఈ గ్యాప్ లో పిల్లలతో కలసి చిన్నపిల్లాడిగా మారి ఎంజాయ్ చేస్తున్నాడు.
పర్సనల్ లైఫ్‌ని, ప్రొఫెషనల్ లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో సూపర్‌స్టార్ మహేష్ బాబుని చూసి తెలుసుకోవాలని ఇండస్ట్రీలో చాలా మంది అంటుంటారు. షూటింగ్ ఉన్నంత సేపు తన పని తాను చేసుకోవడం ఇంటికి వచ్చాక ఫ్యామిలీ మెన్‌లా ఇద్దరు పిల్లలకు తండ్రిగా వారితో సరదాగా గడపడం మహేష్ స్టైల్. మధ్య మధ్యలో షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుని లాంగ్ ట్రిప్ వేస్తుంటాడు. మహేష్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతోంది. ఈ సమయంలో కొంచెం గ్యాప్ తీసుకున్న ప్రిన్స్ భార్య, పిల్లలతో కలిసి స్విట్జర్లాండ్‌లో ట్రిప్‌లో ఉన్నాడు.
View this post on Instagram
ఈ ట్రిప్‌లో పిల్లలు సితార, గౌతమ్‌తో కలిసి ఈత కొడుతున్న ఫోటోస్ ని తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు మహేష్. ఇద్దరి పిల్లలతో కలిసి శాంతి కోసం వెతుకుతున్నట్లు క్యాప్షన్ ఇచ్చాడు.
View this post on Instagram
మహేష్ భార్య నమ్రతా కూడా ఈ ట్రిప్ సంబంధించి చిన్న వీడియో ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. అందులో సూపర్ స్టార్ తన కూతురితో కలిసి లూసెర్న్‌లో నడుస్తున్నాడు. ఈ వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న‘సర్కారు వారి పాట’ను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్. థమన్ సంగీత దర్శకుడు.ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏంటంటే ఓ యాక్షన్ సీన్‌లో మహేష్‌ని మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ లుక్‌లో చూపించబోతున్నారట. లక్ష్మి నరసింహ స్వామి గెటప్‌లో మహేశ్ కనిపించనున్నాడని టాక్. మరోవైపు. ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ని దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. డిసెంబర్ నాటికి పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: అక్టోబరు 10 మంచు ఫ్యామిలీకి కలిసొచ్చిందా..అప్పుడు మోహన్ బాబు ఇప్పుడు మంచు విష్ణు..హిస్టరీ రిపీట్
Also Read: గరంగరంగా ఆరోవారం నామినేషన్లు…ఆ ఆరుగురిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరు
Also Read: 'అనుభవించు రాజా' సినిమా సాంగ్ లాంచ్ చేసిన నాగచైతన్య
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి