True Hero: ఆ స్టార్ హీరోయిన్ కొడుకు ఛారిటీ... రెండేళ్లు జుట్టు పెంచి మరీ క్యాన్సర్ రోగులకు దానం
మాధురీ దీక్షిత్ చిన్న కొడుకు రయాన్ తన జుట్టును క్యాన్సర్ పేషెంట్లకు దానం చేశారు.
బాలీవుడ్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్. ఆమె ఏక్ దో తీన్ పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఆమెకు ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఆమె మాత్రం తన రియల్ హీరో తన చిన్నకొడుకు రయాన్ అని చెబుతోంది. రయాన్ క్యాన్సర్ పేపెంట్ల పరిస్థితి చూసి చాలా చలించిపోయాడని, వారి కోసం ప్రత్యేకంగా జుట్టు పెంచుకున్నాడని ఇన్ స్టా పోస్టులో తెలియజేసింది. అంతేకాదు ఆ జుట్టును క్యాన్సర్ రోగులకు దానం ఇస్తున్నట్టు వీడియోను కూడా పోస్టు చేసింది. ఇప్పుడది ఇన్ స్టాలో వైరల్ గా మారింది. రయాన్ నిజంగా రియల్ హీరో అని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు.
మాధూరి దీక్షిత్ ఇన్ స్టా పోస్టు ప్రకారం దాదాపు రెండేళ్ల క్రితం రయాన్ గుండుతో కూడిన క్యాన్సర్ పేషెంట్లను చూసి చలించిపోయాడు. వారి కోసం తాను ఏం చేయగలనని ఆలోచించి, జుట్టు పెంచుకోవడం మొదలుపెట్టాడు. రెండేళ్లుగా రయాన్ జుట్టు కత్తిరించుకోలేదు. అది ఇప్పుడు పొడవుగా పెరిగింది. దాన్ని కత్తిరించి క్యాన్సర్ సొసైటీకి విరాళంగా ఇచ్చేశాడు. అతని జుట్టు కత్తిరించిన వీడియోను మాధురి ఇన్ స్టాలో పోస్టు చేసింది. కొడుకు నిర్ణయాన్ని విని తల్లిదండ్రులుగా తాము చాలా సంతోషించినట్టు తెలియజేసింది మాధురి.
మాధురి ఫ్యాన్స్ ఇప్పుడు రయాన్ కు అభిమానులైపోయారు. పిల్లాడిని చక్కగా పెంచారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ‘నిజంగా అద్భుతం. రియల్ హీరో’ అంటూ మెచ్చుకుంటున్నారు. రయాన్ ను ఆదర్శంగా తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. మాధూరికి మరో కొడుకు కూడా ఉన్నాడు. పెద్ద కొడుకు అరిన్ ప్రస్తుతం కాలిఫోర్నియా యూనివర్సిటీలో చదువుతున్నాడు.
View this post on Instagram
Also read: లవ్ బ్రేకప్ అయితే ఎక్కువ బాధపడేది మగవాళ్లేనట... తేల్చిన కొత్త అధ్యయనం
Also read: రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకుంటే... ఏడున్నర కోట్ల రూపాయలు వచ్చాయి, ఎంత అదృష్టవంతురాలో
Also read: పిల్లలకు రోజుకో ఉడికించిన గుడ్డు తినిపించండి... ఆరోగ్యానికి ఢోకా ఉండదు
Also read: మీ గురక వల్ల ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడుతున్నారా... ఇలా చేసి చూడండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి