అన్వేషించండి

MAA Elections: అధ్యక్షుడిగా పోటీ చేద్దామనుకున్నా, కానీ అతడు చెప్పింది విని...

‘మా’అసోసియేషన్ ఎన్నికలు ఇప్పటికే టాలీవుడ్ లో వేడిని రాజేశాయి. ఏ ప్యానెల్ గెలుస్తుందో అన్న ఆసక్తి సినీ అభిమానుల్లో పెరిగిపోయింది.

గతంలో ఎప్పుడూలేనంత ఉత్కంఠ తొలిసారి ‘మా’ అసోసియేషన్ ఎన్నికల్లో నెలకొంది. విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెళ్లలో ఏది గెలుస్తుందో అన్న ఆసక్తి సినీ ప్రియుల్లో ఎక్కువైంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మద్దతిస్తున్న రాజశేఖర్ తాను కూడా అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకున్నానని తెలిపాడు. అసోసియేషన్ అధ్యక్ష పీఠం అనేది పెత్తనం చేసేందుకు కాదని, అది ఒక బాధ్యతని చెప్పుకొచ్చారు రాజశేఖర్.  పరిశ్రమలో ఎంతో మంది గొప్ప నటీనటులు ఉన్నారని, ఎంతో కీర్తి ప్రతిష్ఠలు సొంతం చేసుకోవాలని అన్నారు. అందుకు మా అసోసియేషన్ తగిన అధ్యక్షుడు కావాలని అన్నారు. అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ గెలిస్తే అసోసియేషన్ ఎంతో అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నట్టు అన్నారు.  అసోసియేషన్లోని సభ్యుల సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తినే అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని కోరారు. 

తనకు కూడా ‘మా’అధ్యక్షుడిగా పోటీ చేయాలనే ఆలోచన ఉండేదని అన్నారు రాజశేఖర్.  అలాంటి సమయంలో ప్రకాష్ రాజ్ తన ఇంటికి వచ్చి... మా అసోసియేషన్ సంక్షేమం కోసం ఏమేం చేయాలనుకుంటున్నారో వివరించారని, అది విన్నాక తాను మనసు మార్చుకున్నట్టు చెప్పారు రాజశేఖర్. తన కన్నా ప్రకాష్ రాజ్ అధ్యక్షుడు అవ్వడమే మంచిదనిపించిందని, అందుకే తాను పోటీ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నానని తెలిపారు. అసోసియేషన్  అభివృద్ధి చేయాలంటే చాలా డబ్బు అవసరమని, అందుకోసం చాలా ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ నిర్వహించాలని అన్నారు. ప్రకాష్ రాజ్ కు వివిధ భాషా ఇండస్ట్రీలతో మంచి సంబంధాలున్నాయి కనుక ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు అతను చక్కగా నిర్వహించగలడని అన్నారు రాజశేఖర్. అందుకే తాను అధ్యక్ష పదవికి పోటీ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్టు తెలిపారు. అలాగే ప్రకాష్ రాజ్ కు కూడా తన మద్దతును తెలిపినట్టు చెప్పాడు. 

తేలేది ఆ రోజే
మా ఎన్నికల ప్రక్రియలో స్వల్ప మార్పులు జరిగాయి. అక్టోబర్ 10 ఆదివారం పోలింగ్ జరుగుతుండగా, అక్టోబర్ 11 సోమవారం ఫలితాలను విడుదల చేయనున్నారు. ముందు మాత్రం ఆదివారమే పోలింగ్ నిర్వహించి, ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించారు. ఈ విషయంలో కాస్త మార్పులు జరిగాయి. అధ్యక్షడయ్యేదో ఎవరో అక్టోబర్ 11, సోమవారం తేలిపోనుంది. 

Also read: మొన్న రకుల్, నేడు మంచు లక్ష్మి... సమంతకు పెరుగుతున్న మద్దతు

Also read: ఈ లక్షణాలను తేలికగా తీసుకోకండి.. గుండె ఆరోగ్యాన్ని చెప్పేస్తాయివి

Also read: సోనూసూద్ సిమ్ కార్డు... 10జి నెట్ వర్క్, అంతా ఉచితమే

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Ramayana Vs Scene: బుకింగ్స్‌లో 'రామాయణ' ఎదురీత... సూర్య 'సీన్' సేల్స్ ఎక్కువ
బుకింగ్స్‌లో 'రామాయణ' ఎదురీత... సూర్య 'సీన్' సేల్స్ ఎక్కువ
Nindu Noorella Saavasam Serial Today November 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మను ప్లాన్‌ సక్సెస్‌ – ఇంటికి వచ్చేయమన్న అమర్‌
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మను ప్లాన్‌ సక్సెస్‌ – ఇంటికి వచ్చేయమన్న అమర్‌
Tamil Nadu Screening Rules: కోలీవుడ్‌కు సీఎం విజయ్ గిఫ్ట్... ఎర్లీ మార్నింగ్ షోస్ షురూ - ఆరు షోలు వచ్చాయ్ కానీ ఆ ఒక్కటీ మిస్
కోలీవుడ్‌కు సీఎం విజయ్ గిఫ్ట్... ఎర్లీ మార్నింగ్ షోస్ షురూ - ఆరు షోలు వచ్చాయ్ కానీ ఆ ఒక్కటీ మిస్
Bigg Boss Season 10 Today November 3rd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఫ్యామిలీ స్టోరీస్ చెప్పి ఏడిపించేసిన కంటెస్టెంట్స్! ముకేశ్ తప్పు చేశాడా.. సుధీర్ దూరం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఫ్యామిలీ స్టోరీస్ చెప్పి ఏడిపించేసిన కంటెస్టెంట్స్! ముకేశ్ తప్పు చేశాడా.. సుధీర్ దూరం!

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Conductor Dies: చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
GVMC Mayor ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
జీవీఎంసీ మేయర్‌‌గా ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
AP Municipal Election Results: ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?
ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Embed widget