By: ABP Desam | Updated at : 28 Aug 2022 11:48 AM (IST)
విజయ్ దేవరకొండ (Photo: Twitter/@TheDeverakonda)
Liger Movie Box Office Collections: జోరుగా ప్రచార కార్యక్రమాలతో ‘లైగర్’ సినిమాకు ఊపు తెచ్చినా.. విడుదల అయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా తొలి షో నుంచే నెగెటివ్ టాక్ రావడం మైనస్ పాయింట్ అయింది. సినిమా ఆశించిన మేర లేకపోవడంతో కలెక్షన్లపై ప్రభావం చూపుతోంది. అయినా తొలి రోజు కలెక్షన్లు బాగానే వచ్చాయి. అనుకున్న దానికంటే కాస్త తక్కువగా వచ్చినా ఫర్వాలేదు అనిపించాయి. కానీ, మూడో రోజు వచ్చే సరికి పరిస్థితి మరింత దిగజారింది. సినిమా హాళ్లకు ప్రేక్షకులు రావడమే మానేశారు. కలెక్షన్లు సైతం దారుణంగా పడిపోయాయి.
లైగర్ ను కాపాడిన తొలిరోజు వసూళ్లు..
వాస్తవానికి సినిమా రిలీజ్ రోజున కలెక్షన్లు రూ. 35 కోట్లు దాటుతాయి ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ, ప్రపంచ వ్యాప్తంగా రూ. 33.12 కోట్ల రూపాయలను సాధించినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రెండో రోజు, తొలి రోజు వచ్చిన సగం కలెక్షన్లు కూడా రాలేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం కలిపి రూ. 3.5 కోట్లు వచ్చాయి. హిందీలో రూ. 3.82 కోట్లు, తమిళంలో రూ. 20 లక్షలు, మలయాళంలో రూ. 8 లక్షలు వసూళు చేసింది. మూడో రోజు మొత్తంగా ఏడున్నర కోట్ల వరకు డబ్బులు రాబట్టింది. విచిత్రం ఏంటంటే.. రెండో రోజు బాలీవుడ్ లో ఈ సినిమా బాగానే ఆడింది. మళ్లీ మూడో రోజుకు వచ్చే సరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకులు లేక థియేటర్ల వెలవెలబోయాయి.
మూడోరోజు మరింత కిందకు..
ఇక మూడో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. భారీగా పడిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ. 5 నుంచి 6 కోట్ల షేర్ సాధించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో రూ. 1.5 నుంచి 3 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక మూడు రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.5 నుంచి 23.51 కోట్ల షేర్ అందుకుంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సంబంధించిన వసూళ్లు చాలా వరకు తగ్గాయి. అన్ని ప్రాంతాల్లోనూ థియేటర్లకు ప్రేక్షకులు బాగా తగ్గిపోయారు. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కెరీర్ కు ఈ సినిమా మైనస్ గా నిలుస్తుందనే టాక్ సినీ పరిశ్రమలో వినిపిస్తోంది. ఈ ఫ్లాప్ సినిమాను ప్రదర్శించడం కంటే మరో సినిమాను షో వేయడం మంచిదని కొన్ని ప్రాంతాల్లో థియేటర్ల యజమానులు భావిస్తున్నారట.
మొత్తంగా లైగర్ సినిమా యూనిట్‌కు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. సినిమాలో కంటెంట్ లేకపోయినా.. భారీ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో సినిమా మీద భారీగా అంచనాలు పెరిగేలా చేసింది పూరి అండ్ టీమ్. ఎన్నో అంచనాలతో సినిమా థియేటర్లకు వెళ్లిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురయ్యింది. మొత్తంగా సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ కు ముందే ఓటీటీలో భారీ ఆఫర్ వచ్చినా థియేటర్‌లో అంతకుమించి వసూళ్లు సాధిస్తామని మూవీ యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియన్ మూవీగా ‘లైగర్’ తెరకెక్కింది. రౌడీ హీరో సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డులను బద్దలు కొడుకుంది అని సినీ జనాలు భావించినా.. అట్టర్ ఫ్లాపై అందిరినీ షాక్ కు గురిచేసింది. అటు విజయ్, పూరి కాంబోలో ‘జన గణ మణ’ సినిమా తెరకెక్కుతుంది. లైగర్ ప్రభావం ఈ సినిమా మీద భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Robert Downey Jr: ఆ హీరో నమిలేసిన చూయింగ్ గమ్ రూ. 45 లక్షలా? ఏం చేసుకుంటారు నాయనా?
Balagam Censored Dialogue: సెన్సార్కు ముందు, సెన్సార్ తర్వాత - ‘బలగం’లోని ఆ డైలాగ్ లీక్ చేసిన ప్రియదర్శి
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?
Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్