By: ABP Desam | Updated at : 11 Apr 2022 06:54 PM (IST)
నాని 'దసరా' కోసం 'నాటు నాటు' కొరియోగ్రాఫర్
'శ్యామ్ సింగరాయ్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న హీరో నాని వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. రీసెంట్ గా 'అంటే సుందరానికీ' సినిమాను పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన 'దసరా' అనే మరో సినిమాలో నటిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తొలిసారి ఈ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారు నాని.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తెలంగాణ, పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనిలో జరుగుతుంది. చిత్రీకరణలో భాగంగా నాని, కీర్తి సురేష్ పై భారీ స్థాయిలో పాటని షూట్ చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో 'నాటు నాటు' పాటలో సంచలన స్టెప్స్ సృష్టించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకు కోరియోగ్రఫీ అందిస్తున్నారు. దాదాపు500 మంది డ్యాన్సర్లతో ఈ పాటని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులని అలరించడమే లక్ష్యంగా మండు వేసవిని సైతం లెక్క చేయకుండా ఈ పాట కోసం చిత్ర యూనిట్ కష్టపడి పనిచేస్తుంది.
సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ లాంటి తారలు ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. నాని నటించిన తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్, నవీన్ నూలి ఎడిటర్.
Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్
Bigg Boss OTT Telugu: గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం - ఇదిగో ప్రోమో
NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?
Pooja Hegde: ‘కేన్స్’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!
NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్
BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్బాడీ అప్పగింత
Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !
Tattoo Child: ఆ పసివాడి ఒళ్లంతా పచ్చబొట్లే, తల్లిని తిట్టిపోస్తున్న జనం, కానీ అసలు కథ వేరే ఉంది!
MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !